తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday, 31 December 2015

వీఁపుఁ జూపువాఁడె వీరవరుఁడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  11 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - వీఁపుఁ జూపువాఁడె వీరవరుఁడుఆటవెలది: 
బాడి బిల్డరగుచు పదిమందిలో నిలచి 
చేతికండరములు సిక్సు ప్యాకు 
పొట్ట ఛాతి త్రిప్పి పొంగించుచు తిరిగి 
వీఁపుఁ జూపువాఁడె వీరవరుఁడు

Monday, 28 December 2015

అద్దరినీ జేర్చమనీ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  10 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - అద్దరినీ జేర్చమనీ 

కందము: 
దరిజేరిన మమ్ములనే 
దరిజేర్తువుగాద రామ ! దాశరధీ ! య 
ద్దరిజేర్చగ రమ్మని నీ
దరిశనమేయిచ్చినావు దండము తండ్రీ ! 

Sunday, 27 December 2015

ఏలూరుననుండు వారలెల్లరు కవులే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  09 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - ఏలూరుననుండు వారలెల్లరు కవులేకందము: 
కాలంబప్పుడు చూడ, ర 
సాలూరగ కాళిదాసు సభలో కవియే 
మేలుగ భోజ మహారా 
జేలూరున నుండు వారలెల్లరు కవులే. 

Saturday, 26 December 2015

పైవి లేని వాడు పైకి వచ్చు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  09 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - పైవి లేని వాడు పైకి వచ్చుసీసము: 
తండ్రికి కనిపించు తప్పుడు విద్యార్థి 
డబ్బు తగులవేయు సుబ్బడి వలె 
తల్లికి కళ్ళలో ధనరాశి వలె దోచు 
కట్నమ్ము దోచెడు కనక బాబు 
నాయకమ్మన్యుల నయనాలలో వాడు 
జేలు కొట్టు వట్టి కీలుబొమ్మ 
పాఠాలు నేర్పెడి పంతులు గారికి 
నడ్డ గాడిదవలె నగుపడుగద 

ఆటవెలది: 
చిలిపి పనుల తోడ చినదాని కగుపించ 
కోతి చేష్టలనుచు కొక్కిరించు 
లెక్కలోననిడడు ప్రక్క వాడునుగూడ 
పైవి లేని వాడు పైకి వచ్చు. 

Friday, 25 December 2015

.రాముని భార్యలకు నింద రానే వచ్చెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  08 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - రాముని భార్యలకు నింద రానే వచ్చెన్.కందము: 
ఏమని చెప్పుదు గాధలు 
కామముతో సలుపుపనుల కతననపుడు సు 
త్రాముడు నగ్ని వలననే 
రా ! ముని భార్యలకు నింద రానే వచ్చెన్.

Thursday, 24 December 2015

ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  08 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా 
కందము: 
చల్లని వానయె కురియగ 
జల్లుగనే మోము మీద చాలా ముదమే 
ఝల్లను మనసే, తడవగ 
పిల్లలవలె నాట్యమాడు పెద్దలు నిజమే ! 

కందము: 
ఇన్నాళ్ళకు గుర్తొచ్చా
చాన్నాళ్ళకు వచ్చినావె చప్పున వానా 
నిన్నే చుట్టములాగా 
చెన్నుగనే చేరదీయ చేతుల నిడితిన్.

Wednesday, 23 December 2015

మం " గళం " పల్లి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  07 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - మం " గళం " పల్లి 

సీసము: 
పంచరత్నములను పరవశమ్మున బాడి 
త్యారాజును మన తలపు నింపు 
రాముని కీర్తనల్ రమ్యంబుగా పాడి 
అలనాటి గోపన్న యార్తి పంచు 
తిల్లాన జల్లులే తీపిగా కురిపించి 
ప్రేక్షకజనముల ప్రీతి ముంచు 
కర్ణాట సంగీత గానమ్ము తలపగా 
తనదు రూపమెమన తలను నిల్చు 

తేటగీతి: 
పేరునందునబాలుండె పెద్ద పేరు
వాద్యమున్నది పేరులో వాక్కు తీపి
గీతజెప్పిన వాడె సంగీతమందు
మంగళంబగు నాగళ మహిమనెన్న.

Tuesday, 22 December 2015

కొక్కొరొకో కొక్కొరొ యని కోకిల కూసెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  06 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - కొక్కొరొకో కొక్కొరొ యని కోకిల కూసెన్.కందము: 
చక్కగ సాఫ్ట్వేరొక్కడు 
కొక్కొరొ, కూకూ, ల కూత కోరుచు జేసెన్ 
చిక్కులు జరుగగనందున 
కొక్కొరొకో కొక్కొరొ యని కోకిల కూసెన్.


పిల్లలు అల్లరి చేస్తూ అరిచిన కూతలు...

కందము: 
కిక్కీ యని కాదంబరి 
విక్కీ, తేజస్వి కలసి పిపిపీ యనుచున్ 
కుక్కూ యనుచును కోమలి 
కొక్కొరొకో కొక్కొరొ యని కోకిల, కూసెన్.

Monday, 21 December 2015

మంచి విద్యల నేర్చుట మానవలెను.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  05 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - మంచి విద్యల నేర్చుట మానవలెను.హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో...

తేటగీతి: 
మించి తలచుట మనమున కొంచెమైన 
విడువకుండగ పూజించ విజ్ఞతయని 
మంచి చదువంచు హరిగాధ మదిని నిడకు 
మంచి విద్యల నేర్చుట మానవలెను.

Sunday, 20 December 2015

గర్భములోనుండి వెడలెఁ గమలాప్తుఁ డొగిన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  04 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - గర్భములోనుండి వెడలెఁ గమలాప్తుఁ డొగిన్.
కందము: 
నిర్భ యమందగ నరులకు  
దుర్భర తిమిరమ్ము తాను తొలగించునురా 
అర్భక సాగర ! సాగర 
గర్భములోనుండి వెడలెఁ గమలాప్తుఁ డొగిన్.

Saturday, 19 December 2015

సవతి లేని యింట సౌఖ్యమేది

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  03 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - సవతి లేని యింట సౌఖ్యమేదిఆటవెలది: 
హరికి సిరులరాణి మరియొకరు ధరణి 
భార్యలగుచు నొప్పు భాగ్యమొప్ప 
పుడమినున్న మనకు గడువగ భూదేవి 
సవతి లేని యింట సౌఖ్యమేది?

Friday, 18 December 2015

ఆకలి కవి (త)

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  29 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం:ఆకలి కవి (త)  తేటగీతి: 
కొట్టుకెళ్ళుదు తెత్తును కొబ్బ,రెండు 
మిరపకాయలు, మిరియాలు, మినపగుండ్లు
చింత పండును, బియ్యమ్ము, మెంతులున్ను 
అప్పు పెట్టిన మనశెట్టి యొప్పుకున్న 

Thursday, 17 December 2015

కైక పతిన్ రఘూత్తమునిఁ గానల కంపకు మంచు వేడెఁగా.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - కైక పతిన్ రఘూత్తమునిఁ గానల కంపకు మంచు వేడెఁగా.ఉత్పలమాల: 
ఆకఠినాత్మురాలి మది యాశలు సాగగనీకు దైవమా 
మా కనుచూపు వీడు, మరి మమ్ములవీడిన సైపలేమయా 
శ్రీకర యంచయోధ్యపురి చిన్నలు పెద్దలు బాధతోడ లో 
కైక పతిన్ రఘూత్తమునిఁ గానల కంపకు మంచు వేడెఁగా.

Wednesday, 16 December 2015

పిల్లి, పిల్ల

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - పిల్లి, పిల్ల  


కందము: 
మెల్లగ రావే నాతో 
పిల్లీ, మాయమ్మ నాకు పిలచుచు నిచ్చున్
చల్లని పాలను, నీకును 
బుల్లీ నేనిత్తు నింక బుజ్జీ రావే !

Tuesday, 15 December 2015

మూగవాడు పాడె మోహనముగ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - మూగవాడు పాడె మోహనముగఆటవెలది: 
పట్నమందు జేరి పలువురు దిరుగాడు 
వీధి నడుమ నొకడు వేడుకొనుచు 
డప్పుగొట్టి పిలువ చప్పున పదిమంది 
మూగ, వాడు పాడె మోహనముగ. 

Monday, 14 December 2015

కప్పల పెండ్లి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - కప్పల పెండ్లి కందము: 
కప్పల పెండ్లిని జేయగ 
గప్పుచు నాకాశమంత కరిమేఘములే 
తెప్పలుగ చెరువు నిండగ 
నప్పుడె వానల్లు గురియు నిజమది వింటే. 

Saturday, 12 December 2015

విస్కీత్రాగి యవధాని వెస సభ కేఁగెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - విస్కీత్రాగి యవధాని వెస సభ కేఁగెన్.కందము: 
మాస్కోలో చలియున్న న 
మస్కారము మీకననుచు మర్యాదకునై 
బిస్కెట్ కాఫీ, వలదని 
విస్కీ- త్రాగి యవధాని వెస సభ కేఁగెన్.


అసెంబ్లీకి వెళ్ళే ఎస్కే అవధాని అను ఒక ఎమ్మెల్యే గురించి.... 

కందము: 
ఎస్కే. అవధాన్యమ్మె
ల్యే, స్కాములలోననతడు నిన్వాల్వయ్యెన్
మస్కాగొట్టగ మాటల
విస్కీ త్రాగి యవధాని వెస సభ కేఁగెన్.

కందము: 
ఇస్కా నాం హై అవధా 
నీ, స్కూలున చదవలేదు, నేడెమ్మెల్యే 
మస్కా గొట్టును బాగుగ 
విస్కీ త్రాగి యవధాని వెస సభ కేఁగెన్.

Friday, 11 December 2015

భూకైలాస్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - భూకైలాస్. 

తేటగీతి: 
ఆత్మలింగమ్ము భూమిలో నణగి పోయె 
వ్యర్ధమౌనయ్య నీశక్తి నాపుమింక 
క్షితిని గొప్పగ గోకర్ణ క్షేత్రమగుచు
వెలయు రావణ నీపేరు వెలుగులీను.

Thursday, 10 December 2015

రవికవిప్పి డాసె రమణి యతిని.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  25 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - రవికవిప్పి డాసె రమణి యతిని.

ఆటవెలది: 
మడినిగట్టువారె మరి పాదపూజకు 
అర్హులనుచు జెప్ప నచటివారు 
కట్టి మడిని తాను కట్టిన చీరెయు 
రవికవిప్పి, డాసె రమణి యతిని.

Wednesday, 9 December 2015

మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  22 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్కందము: 
తీరగు ధర్మము నెరుగుచు 
మారినచో తీవ్రవాద మంతమ్మగుచో 
నోరామా ! జరుగదెపుడు 
మారణహోమమ్ము, కూర్చు మహిలో శాంతిన్

Tuesday, 8 December 2015

పాలుత్యజించి నీరమును పాన మొనర్చును హంస లెప్పుడున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - పాలుత్యజించి నీరమును పాన మొనర్చును హంస లెప్పుడున్ఉత్పలమాల: 
చాల విశేషమే వినగ సాధ్యమదెట్టులొ చూచినారటే 
పాలను నీటినే గలిపి ప్రక్కన నుంచిన చెంతజేరి లో 
పాలను చూపబోక తమపాలుగ ద్రావగ వేరుచేయుచున్ 
పాలు, త్యజించి నీరమును, పాన మొనర్చును హంస లెప్పుడున్

Monday, 7 December 2015

శంతనుడు,మత్స్యగంధి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - శంతనుడు,మత్స్యగంధి 


కందము: 
శంతనుడందురు నన్నే 
చెంతనునువు లేక నాకు చెలియా రాజ్యం 
బింతయు పట్టదు, పట్టుదు 
నింతీ ఓ మత్స్యగంధి యిదె నీ చేతిన్. 

కందము: 
నామీదాశను బడితివి 
స్వామీ శ్రీ దాశరాజు సరి నాపిత, నే 
నేమీ కోరను, యొప్పుగ 
నే మీదానగనె యడుగు నెవ్విధినైనన్.

Sunday, 6 December 2015

కాకి కాకిగాక కేకి యగునె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  20 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - కాకి కాకిగాక కేకి యగునె.ఆటవెలది: 
కేకిజూచి కాకి కాకతో కేకీక 
కోక జేసి కట్టి కూత గూయ 
"కాక కాక " గాక కేకికేకలగున 
కాకి కాకిగాక కేకి యగునె ?

Saturday, 5 December 2015

వామన గుంతలాట

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  20 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - వామనగుంతలాట 


కందము: 
ఏమని చెప్పుదు నిప్పుడు 
' మీ, మా ' సీర్యళ్ళ టీవి మెచ్చెడు వేళన్ 
ప్రేమగ నొకచో జేరుచు 
వామనగుంతల నెయాడు వనితలు గలరే ?

Friday, 4 December 2015

చేతకానివాడు శ్రీహరి యట

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - చేతకానివాడు శ్రీహరి యటఆటవెలది: 
ధర్మ హాని జేయు దనుజుల పాలిటి 
సింహ స్వప్న మగుట చేత, వారి 
పనులు సాగనీక పరిమార్చు చుండుట 
చేత, కాని వాడు శ్రీహరి యట

Thursday, 3 December 2015

కర్ణుడెద్దునెక్కి కంసు జంపె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  16 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కర్ణుడెద్దునెక్కి కంసు జంపె
ఆటవెలది: 
ఇంతి కుంతి బట్ట నినసుతు డెవ్వడు ?
హరుడు దేనినెక్కి తిరుగునయ్య ?
వెన్నుడెవనిజంపె పిడికిలి తానెత్తి ?
కర్ణు - డెద్దు నెక్కి- కంసు జంపె.

Wednesday, 2 December 2015

భూతప్రేతముల పూజ మోక్షము నొసఁగున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  15 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - భూతప్రేతముల పూజ మోక్షము నొసఁగున్.  కందము:
ప్రీతిగ మనసున దలచుచు 
చేతులనే మోడ్చి గొల్వ జేజే లనుచున్ 
వాతాత్మజు, తొలగించును 
భూతప్రేతముల, పూజ మోక్షము నొసఁగున్.

Tuesday, 1 December 2015

అన్నమో రామ్మా...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  15 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - అన్నమో రామ్మా...


ఆటవెలది: 
ఎత్తుకెళ్ళగలిగె నీయన నామెను 
కూడు బెట్ట మనుచు, చూడ నిపుడు 
పిన్నిగారి భర్త పిలుచుటకే నోరు 
రాక నీరసమున వ్రాలియుండు.

Monday, 30 November 2015

నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  14 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ. 
కందము: 
మీరిన వయసున తీరని 
కోరికలే రేగెనంచు కోమలి కొరకై 
చేరుచు వెదకుచు నొక చి
న్నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ.

Sunday, 29 November 2015

ముక్కలాట


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  14 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ముక్కలాట 

కందము: 
ఆక్కౌంటున బ్యాలెన్సును 
ముక్కొక్కటి చెప్పమంటి మూణ్ణిమిషాలా? 
ముక్కలె చూచుచునుంటిని 
ముక్కేదియొ బోధపడక మూల్గుచునుంటిన్ !

కందము: 
ఒక్కటె ముక్కన జెప్పుము 
చెక్కిచ్చితి పైకమిందు జేరెన మేడం ? 
చిక్కులు ముక్కలతోనే 
ముక్కొక్కటి తేల్చలేక మూడాఫాయెన్ !

Saturday, 28 November 2015

సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  13 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్.కందము: 
ఆరామదాసు చెప్పెను 
మారాముని నామమన్న మధురంబనుచున్ 
రారా ! నామపు రుచి మన 
సారా గ్రోలంగ, జన్మ చరితార్థ మగున్.

Friday, 27 November 2015

లాగూ..లాగూ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  11 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న చిత్రం - లాగూ..లాగూ


కందము: 
లాగును కట్టితివిటనీ 
లాగున నీబ్రతుకునీడ్వ లాఘవముననే 
లాగుచు నుంటివి బండిని 
లాగించక తప్పదుగద లాగుమలాగే ! 

Thursday, 26 November 2015

కమలము ముకుళించె సూర్యకరములు సోకన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  10 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - కమలము ముకుళించె సూర్యకరములు సోకన్.కందము: 
తిమిరాంతకునే మునిస 
త్తముమంత్రపు మహిమ జూడ దరికే పిలిచెన్ 
రమణీ యన కుంతీ ముఖ 
కమలము ముకుళించె, సూర్యకరములు సోకన్.

Wednesday, 25 November 2015

పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  09 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున.
తేటగీతి: 
పడుచు ప్రాయమునందున పడితివెన్నొ
కష్ట నష్టాలు కాలమ్ము గడచిపోయె
మాధవుని గొల్వుమనుచును మనసు వెంట
బడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున.

Tuesday, 24 November 2015

పందే నాకిష్ట మనుచు బాపడు పలికెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  04 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - పందే నాకిష్ట మనుచు బాపడు పలికెన్. కందము: 
విందులు నాకెందుకులే 
విందురె నే జెప్పుచుంటి వేడిగయన్నం
బందున నెయ్యావయు ప
ప్పందే నాకిష్ట మనుచు బాపడు పలికెన్. 

Monday, 23 November 2015

తలపెట్టెలు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  03 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - తలపెట్టెలు. 


కందము: 
తల 'పెట్టగ' చదువుల నీ 
'తలపెట్టెలు' పెట్టినారు తలలకు ముందే 
తల 'పట్టున' చదువులు మరి 
'తలపట్టక ' ముందుముందు దారుణ మగునో !   

తలపెట్టె = కంప్యూటరుకు నా తలను పుట్టిన పేరు

Sunday, 22 November 2015

తల్లిదండ్రులఁ దిట్టుటే ధర్మ మగును.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  01 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - తల్లిదండ్రులఁ దిట్టుటే ధర్మ మగును.తేటగీతి:
మంచి దారిని చూపగా మానవులకు
ప్రథమ గురువులు తలిదండ్రి వసుధ లోన
దారిదప్పిన వారల దరిని వారి
తల్లిదండ్రులఁ దిట్టుటే ధర్మ మగును.

Saturday, 21 November 2015

మిరపకాయ బజ్జీలు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  01 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం: మిరపకాయ బజ్జీలు.కందము: 
బజ్జీలను తినగా సమ 
ఉజ్జీలే జేరిరిచట నూరగ నోరే !
బుజ్జీ! త్వరగా వేయుము 
పిజ్జాలను మరచి నేడు పిల్లలు వచ్చెన్. 

Friday, 20 November 2015

పరిహాసము చేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  31 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - పరిహాసము చేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్కందము: 
సరివారు, కానివారలు 
సిరులే లేనట్టివారు శ్రీమంతులునున్ 
దరిజేర జూచి తానొక 
పరి,హాసము చేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్

Thursday, 19 November 2015

ధారణ లేనియట్టి యవధానము గొప్పది యెంచి చూడఁగన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  30 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - ధారణ లేనియట్టి యవధానము గొప్పది యెంచి చూడఁగన్.ఉత్పలమాల: 
శారద మాతనే దలచి సాధ్యము గానిది లేదటంచు నా 
పూరణ లన్ని జేసి ఘన పూరుషుడన్న టువంటి పేరుతో 
ధారణజూపి, పండితుల వద్దకు జేరిన నొక్క తప్పు ని 
ర్ధారణ లేనియట్టి యవధానము గొప్పది యెంచి చూడఁగన్.

Wednesday, 18 November 2015

అమ్మా..యీ ! పూలను గొను

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - అమ్మా..యీ ! పూలను గొను

కందము: 
అమ్మమ్మ పూలనమ్ముట
అమ్మమ్మా తప్పుగాదదాకటికొరకే 
అమ్మాయీ ! పూలను గొను
మమ్మా ! యీ పేదరాలి నాదుకొనమ్మా !

Tuesday, 17 November 2015

రంభను జూచి రాఘవుడు రమ్మని బిల్చె ననంగకేళికిన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - రంభను జూచి రాఘవుడు రమ్మని బిల్చె ననంగకేళికిన్.ఉత్పలమాల: 
సంభవమిద్దిగాదనుచు సందియమందకు మెంచిచూడగన్ 
శంభుని విల్లు వంచి ఘన జానకి బట్టెను నొక్క రాత్రి తా 
స్తంభముప్రక్కనుండ - మది దల్పక నూర్వశి మేనకన్ మరిన్ 
రంభను- జూచి రాఘవుడు రమ్మని బిల్చె ననంగకేళికిన్.

Monday, 16 November 2015

కొమ్మ చేయి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - కొమ్మ చేయి 

కందము:
కొమ్మకు చేతులు పండెను 
కొమ్మల గోరింట దూసి గోటికి బెట్టన్ 
గుమ్ముగ చేతులు నిండెగ 
నిమ్ముగ నే గాజులెల్ల నిరవుగ తొడగన్

Sunday, 15 November 2015

తారలు మధ్యాహ్న వేళ తళుకున మెరసెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - తారలు మధ్యాహ్న వేళ తళుకున మెరసెన్కందము: 
తారట్లాడుచు గన వ 
స్తారో రారోననుచును, సరగున నపుడే  
తీరగు సినిమా సభలో 
తారలు మధ్యాహ్న వేళ తళుకున మెరసెన్


Saturday, 14 November 2015

పాపము చేయంగవలెను భాగ్యము నందన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  25 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - పాపము చేయంగవలెను భాగ్యము నందన్.
కందము: 
పాపము చేసెను గనుకనె 
శాపము దగిలెను దరిద్ర జనులకటంచున్
కోపము జెందక సాయము 
పాపము, చేయంగవలెను భాగ్యము నందన్.

Friday, 13 November 2015

పండ్లతో ఇండ్లు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  25 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - పండ్లతో ఇండ్లు 
కందము: 
పండ్లును కూరలు నారల
నిండ్లను గట్టెడు విధంబు నివ్విధి గంటిన్
కండ్లకు విందుగ నాయెను
పండ్లను కొరుకంగ బోక పరికించుడయా ! 

Thursday, 12 November 2015

కాకిని బెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - కాకిని బెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో
ఉత్పలమాల: 
కాకని చెప్పుచుండ మరి కాకని దల్చకు కాకనంగ నే 
కాకియుగాదు పేరుగన "కాకరపాదుల కిట్టమూర్తి" యే 
కాకియుగూడ గాదు విన కాకని బిల్తురు నిట్టి వాని నీ 
"కాకి"ని బెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో

Wednesday, 11 November 2015

అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

కందము: 
ఆకటిక పేద లందరి
యాకటి బాధలకునంద నాహారమ్మే
చీకటి బ్రతుకుల వెలుగు త 
దేకముగా గలుగ నాడు దీపావళియే. 

Monday, 9 November 2015

పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  23 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండెతేటగీతి: 
పిల్లి పాత్రకు కార్టూను పిక్చరందు 
ఎలుకపాత్రకు డబ్బింగు నిరవుగాను 
చెప్పు వారలు నొకచోట చేరి కలియ 
పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండె

Sunday, 8 November 2015

లాడెను చేయిపట్టుకొని లాగెనుద్రౌపది కౌగలింతకై.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - లాడెను చేయిపట్టుకొని లాగెనుద్రౌపది కౌగలింతకై. ఉత్పలమాల:
వీడను నిన్ను పొందకను, వీడిని కీచకుడందురే సఖీ
నీడగనీదు వెంటబడి నిక్కము కోర్కెను దీర్చుకొందునే
వీడిని బొంద సౌఖ్యములు పెక్కగు నీకని, వ్యర్థ భాషణా
లాడెను, చేయిపట్టుకొని లాగెను, ద్రౌపది కౌగలింతకై. 

Friday, 6 November 2015

నలుగురితో దిరుగు సాధ్వి నా యిల్లాలే

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - నలుగురితో దిరుగు సాధ్వి నా యిల్లాలేకందము: 
వెలుగులు చిందెడు మోమున
తిలకమ్మును దాల్చివచ్చె  దేవళమునకున్ 
అలజూడుడు గుడిచుట్టును 
నలుగురితో దిరుగు సాధ్వి నా యిల్లాలే

Thursday, 5 November 2015

కుంపటిలో నక్క కుక్క కూనల నీనెన్.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కుంపటిలో నక్క కుక్క కూనల నీనెన్.
కందము: 
సంపత్కుమార ! వ్రాయుము 
'కుంపటిలో నొక్క కుక్క కూనల నీనెన్.'
సొంపుగ వ్రాసితి చూడుము 
'కుంపటిలో నక్క కుక్క కూనల నీనెన్.'

Wednesday, 4 November 2015

వర్షంలో పిల్లలు.శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - వర్షంలో పిల్లలు. 

కందము: 
జల్లుల తడిసెడి వేళల 
పిల్లల నేత్రంబులందు వెలుగులు చిమ్మున్ 
చల్లని హర్షపు జల్లులు 
మెల్లగ నా వర్షమందు మేలుగ కలియున్. 

Sunday, 1 November 2015

చేప చన్నులలో బాలు చెంబె డన్ని

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  17 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - చేప చన్నులలో బాలు చెంబె డన్నితేటగీతి: 
చేతి లోనుండి నీటిని చేర్చి కొట్టి 
పొదుగు గడుగుచు చన్నుల పుష్టి జూచి 
పిండ బూనుము గోమాత ప్రీతి పాలు 
చేప, చన్నులలో బాలు చెంబె డన్ని

Saturday, 31 October 2015

హలమున రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  15 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - హలమున రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్

         

కందము: 
కలతను బెట్టిన వానిని
నెలతను చెరబట్టి యనిని నెరపెడు వానిన్
తలలన్నియు బడ కోలా 
హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్. 

చంపకమాల: 
నిలబడి క్షేత్రమంతటను నీరసమందక పంట నీయగా
పొలమును దున్ను వేళ మరి పుట్టిన వ్యర్ధపు మొక్కనెట్టులో
యలయక మట్టుబెట్ట సరి హాలికుడే భువి గూల్చినట్టులే 
హలమున, రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్

Friday, 30 October 2015

తలపే... ను

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  13 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - తలపే... ను 


కందము:  
తల పేను తిరుగుచుండెడి
తలపే బాధించుచుండు, తలలోనున్నన్ 
నెలతల గోటికి చిక్కుచు
నలుగునుగా దాని బ్రతుకు నాల్గుదినాలే ! 

Thursday, 29 October 2015

తమిళకవి యల్లసాని పెద్దనకు నతులు.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  12 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - తమిళకవి యల్లసాని పెద్దనకు నతులు.తేటగీతి: 
తెలుగు గ్రంథమ్ములెన్నియో తెలిసి చదివి 
మనుచరిత్రపు కావ్యమ్ము మనసుదోచ 
కలసి మెచ్చుచు చేసిరి కన్నడకవి  
తమిళకవి, యల్లసాని పెద్దనకు నతులు.

Wednesday, 28 October 2015

జడ "కవి" తలకు సన్మానం.

జడ "కవి" తలకు సన్మానం. తీపి గుర్తు.... సంవత్సరం క్రితం ఇదే రోజు (28-10-2014)  " జడ పజ్యాలు " శతక కర్తలలో నొకనిగా నన్ను కూడా సన్మానించిన శ్రీ బ్నిం గారికి మరొక్కసారి కృతజ్ఞతలు.    

కందము: 
జడ కందములను వ్రాసితి
జడకందము బెరుగునట్లు సరసముగానే 
మెడలో నా " బ్నిం " గారే 
" మెడలును " వేసిరిగ  నాడు మెప్పులతోడన్.   

Tuesday, 27 October 2015

రామాయణమున్ జదివి భారతార్థము జెప్పెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  10 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - రామాయణమున్ జదివి భారతార్థము జెప్పెన్. కందము: 
మాయగ నున్నది నాకే
' టూయిన్ వన్ ' పద్యమొక్కటున్నదటంచున్ 
మాయన్న గొప్పగను రా
మాయణమున్ జదివి భారతార్థము జెప్పెన్.


Monday, 26 October 2015

కడుపాయెను కొడుకు చేతఁ గాంతామణికిన్.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  07 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కడుపాయెను కొడుకు చేతఁ గాంతామణికిన్.కందము: 
కొడుకే వైద్యుడు, తల్లికి 
మిడిమేలపు కడుపునొప్పి మిక్కుట మవగా 
పొడిమందునీయ చక్కని 
కడుపాయెను కొడుకు చేతఁ గాంతామణికిన్.

Sunday, 25 October 2015

నాన్నా....పులి...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  05 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - నాన్నా....పులి...

కందము: 
కల్లలు జెప్పుచు కన్నా ! 
పిల్లలు పరిహాసమాడ పీడలుగలుగున్ 
ఇల్లిదె వినుమా మానెయ్ 
కల్లలు, నాన్నా పులియను కథనే గనుమా ! 


కందము: 
నాన్నా పులియన, రాగా
నాన్నకు పులిలేదనుచును నగుచును జెప్పెన్
నాన్నా పులి యన మరలా 
నాన్నే రాలేదు గాని, నమిలెను పులియే. 

Saturday, 24 October 2015

కుల తత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  03 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కుల తత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్.
కందము: 
ఇల జీవన యానములో 
పలుపలు విధముల నుడివిన పథముల గతిలో 
అల వేమన చెప్పిన పలు 
కుల తత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్.

Friday, 23 October 2015

పందికొక్కులవలన లాభమ్ము గలదు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  29 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - పందికొక్కులవలన లాభమ్ము గలదు.తేటగీతి: 
పట్టిచంపగ లేములే పాడు పాడు 
వాటి జంపగ మందులే బరగ జేసి 
అమ్మజూపెడు వారికి నట్టి యెలుక 
పందికొక్కులవలన లాభమ్ము గలదు. 

Thursday, 22 October 2015

మీకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు  

శ్రీ దుర్గాయైనమః      
కందము:  
భర్గుని దేవీ ! మాతా !
దుర్గా ! నిన్ మదిని వేడి దోయిలినిడ స 
న్మార్గము జూపింతువు, దు
ర్మార్గము మాదరికి రాగ మసియగు గాదా ! 


కందము:
అ మ్మలకే ప్రియ సుతవే !   
అమ్మలకే యమ్మవీవు యపరాజితవే !    
అమ్మహిషు పాలి కాళీ ! 
అమ్మహిమను మహినిజూప  నఘములు ఖాళీ ! 

Wednesday, 21 October 2015

రామ వినాశముం గనుచు రాక్షసు లేడ్చిరి సీత నవ్వెరా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - రామ వినాశముం గనుచు రాక్షసు లేడ్చిరి సీత నవ్వెరాఉత్పలమాల: 
రాముని విల్లునే వదలి రయ్యిన వచ్చిన బాణమై వనిన్  
భూమిజ జూచి, రక్కసులు భోరున నేడ్వగ సీత నవ్వగా 
ప్రేమగ పెంచినట్టి వని పెళ్ళున మారుతి గూల్చుచుండ నా 
రామ వినాశముం గనుచు రాక్షసు లేడ్చిరి సీత నవ్వెరా. 

Tuesday, 20 October 2015

గొట్టము మన యిల్లిది

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - గొట్టము మన యిల్లిది కందము: 
గొట్టము మన యిల్లిది నిన్ 
గొట్టనులే బాగ చదువు కొనవే! బడినె 
గ్గొట్టక చదివిన భావిని 
కట్టింతుము నిజము తల్లి ! కనకపు మేడన్

Monday, 19 October 2015

సారము లేనట్టివాఁడు శైలము నెత్తెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - సారము లేనట్టివాఁడు శైలము నెత్తెన్.
కందము: 
ఆరఘురాముని భక్తుడు 
తేరాగను మూలికలను తెలియక నెవియో 
దారాసుతలును నిజసం 
సారము లేనట్టివాఁడు శైలము నెత్తెన్.

Sunday, 18 October 2015

జీతము లేనట్టి కొలువుఁ జేయుట మేలౌ.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - జీతము లేనట్టి కొలువుఁ జేయుట మేలౌ.కందము: 
ప్రీతిగ కొలువగ రాముని 
త్రాతకు మనసున కొలువిడి దాసుడ వగుచున్ 
నేతకు నౌకరు నేనని 
జీతము లేనట్టి కొలువుఁ జేయుట మేలౌ.

Saturday, 17 October 2015

అవి నీతి కథలు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - అవి నీతి  కథలు


కందము: 
ఇవినీతి కథలు చూడుడు 
అవి నీతిని బోధ సేయు బాలలకెపుడున్ 
అవినీతి త్రోవ బోవదు 
ఇవి నేర్చిన వారి బ్రతుకులింపుగ సాగున్.

Friday, 16 October 2015

అశ్వముఖుఁ డాంజనేయుఁ డబ్జాసనుండు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  22 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - అశ్వముఖుఁ డాంజనేయుఁ డబ్జాసనుండు. 


తేటగీతి: 
వరముగలదులె ముందట వచ్చునట్టి 
యుగమునందున విధితానె యగును గాద
కోతి సింహంబు ఖగ రాజ క్రోడపు మరి 
యశ్వముఖుఁ డాంజనేయుఁ డబ్జాసనుండు.

Thursday, 15 October 2015

మందాకిని పరువు లెత్తె మైసూరు దెసన్.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - మందాకిని పరువు లెత్తె మైసూరు దెసన్. కందము: 
మందాకిని ఎక్స్ ప్రెస్సిది 
ఇందాకనె యెక్కినాను హెల్లో ఫ్రెండూ ! 
ముందే స్టేషన్కే రా ! 
మందాకిని పరువు లెత్తె మైసూరు దెసన్.

Wednesday, 14 October 2015

గరుడ గమన

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - గరుడ గమన 
ఆటవెలది: 
గరుడ రేఖ యున్న కరవదు పామంచు 
నరులు చెప్పుచుంద్రు, నాట్య మీవు 
చేయ గొప్పతనము చెప్పగా లేములే 
గరుడ గమను వైన కతన గాదె.

Tuesday, 13 October 2015

భగవంతుని పూజసేయఁ బాపము దగులున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  20 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - భగవంతుని పూజసేయఁ బాపము దగులున్.హిరణ్య కశిపుడు ప్రహ్లాదునితో...


కందము:
తెగ మెచ్చుకొనుఛు నుంటివి
జగమంతయు హరియె యనుచు, సరె! ప్రహ్లాదా ! 
అగుపించని వాడగు నా 
భగవంతుని పూజసేయఁ బాపము దగులున్.