శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కడుపాయెను కొడుకు చేతఁ గాంతామణికిన్.
కందము:
కొడుకే వైద్యుడు, తల్లికి
మిడిమేలపు కడుపునొప్పి మిక్కుట మవగా
పొడిమందునీయ చక్కని
కడుపాయెను కొడుకు చేతఁ గాంతామణికిన్.
No comments:
Post a Comment