తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday, 31 March 2019

జడ"కందాలు" - 71

71: జడను సవరిస్తూ...

జడకందించుచు సుమముల
జడకందక కోపమందు జడసవరిస్తూ
జడ సవరమునే లాగక
జడబాగుందనుచు మెచ్చు జనులే ఘనులౌ.

Saturday, 30 March 2019

జడ"కందాలు" - 70

70 - జడ, గుడి కావాలి. 

జడలే లేకను భువిలో 
గుడులే లేనట్టి వేళ కువలయమందున్ 
కడు సుందర పుష్పములె
క్కడ బోవలె, జడయు గుడియు గావలె గదరా! 

Wednesday, 27 March 2019

జడ"కందాలు" - 69


69: జడ 'లైక్' డు బేబీ

అయ్యో మమ్మీ కూంబ్ చెయ్
అయ్యాల్సో లైకు దిస్సు హాండ్సం జడనే
అయ్యా మిండ్యన్ గర్లే 
షయ్యేం ఫీల్గాను నాకు జడ థ్రిల్లంటా .

Tuesday, 26 March 2019

జడ"కందాలు" - 68


68: యాంటీ జడ ఆంటీ కీ బాత్    

ఏజడ క్యారే హంకో
రోజానా తేల్కొ దాల్కె రోనాపడ్తా
మై జాన్ తానై అల్లింగ్ 
వీజీరే బాల్కొ ఛోడ్కె విరబోస్కుంటే.

Monday, 25 March 2019

జడ"కందాలు" - 67


67: పువ్వుల నవ్వుల్.     

పడతియె మెచ్చిన వానికి   
నడచుచు తా గన గనపడు నవ్వుల పువ్వుల్   
పడి వెనుకను జడ జూడగ   
ముడిచిన మల్లెల  వినబడు పువ్వుల నవ్వుల్.    

Sunday, 24 March 2019

జడ"కందాలు" - 66

66: క్లిప్పు...లిప్పు.


జడకందము దెచ్చుటకై
జడమెల్లగ దువ్వి "క్లిప్పు" సరిజేయవలెన్
జడ "కందము" వచ్చుటకై 
"జడ"  పదమును జేర్చి "లిప్పు" సరిగదపవలెన్. 

Saturday, 23 March 2019

జడ"కందాలు" - 65


65: జడవని ఆముక్తమాల్యద 

జడలో వాడినపూలను 
వడి వేడుక విష్ణువునకు వాడుట గనుచున్ 
పడి విష్ణుచిత్తుడేడ్చెను 
దడవక నాముక్తమాల్య దయె హరి వలచెన్.  

Friday, 22 March 2019

హాయ్ - హలో - గుడ్ - బై

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20. - 03 - 2019 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


దత్తపది: హాయ్ - హలో - గుడ్ - బై ....భారతార్థంలో. 


తేటగీతి:  
గుడ్డలూడ్చిన ఫలితమే కురుపతికిని
బైట నపకీర్తి నందించె, బ్రతుకులోన  
హాయి లేకుండ సామ్రాజ్యమంత వోయి
యూహలోలేని మృతిగల్గె యుద్ధమందు. 

జడ"కందాలు" - 64


64. బా(పా)రెడు కృష్ణవేణి


కొండల నడుమనబారెడు
నిండగునా కృష్ణవేణి నేత్రోత్సవమౌ 
"కొండల" నడుమన "బారెడు"
నిండగు నీ "కృష్ణవేణి" నేత్రోత్సవమౌ.  

Tuesday, 19 March 2019

జడ"కందాలు" - 63

63: జడబిళ్ళగా శశి 


సిగ్గున సంధ్యాసుందరి 
మొగ్గగ తానెర్రనగుచు మొగమును ద్రిప్పెన్  
దిగ్గున జడలో బిళ్ళగ 
తగ్గటులే నగుచు శశియె ధగధగ మెరసెన్.  

Monday, 18 March 2019

జడ"కందాలు" - 62

62: పిల్లలు పీకిన జడలు

అల్లన జడలే వేయగ 
పిల్లలు తల గీరిగీరి పీకుచునుండన్
మెల్లగ ముద్దును జేయుచు 
తల్లియె పదిమార్లు వేయు తగు యోరిమితో. 

Sunday, 17 March 2019

జడ"కందాలు" - 61

61:యెట్టో సవరమ్ము జేర్చి


జుట్టేమో జానెడు మరి
పట్టగ పూజడ కొరకిటు వదలని పట్టే 
కట్టెను చిట్టికి  తల్లియె 
యెట్టో సవరమ్ము జేర్చి, యేడుపు మాన్పన్. 

Saturday, 16 March 2019

జడ"కందాలు" - 6060: తగిలించమంటే 


సిగ జానెడు లేకున్నను 
తెగగొడవనుజేసి పాప తెమ్మని పూలన్    
తగిలించమనగ పూజడ   
తగదిదియని తల్లి నాల్గు తగిలించెగదా!   

Friday, 15 March 2019

జడ"కందాలు" - 59

59: ఉండక కుదురుగ పీకుదురుగ

వద్దని మారాంజేయగ 
ముద్దులనిడి తల్లి దువ్వి ముచ్చట కురులన్ 
దిద్దగజడ, పాపాయిలు
రుద్దుచు పీకుదురె యల్లరోహో గనుడీ. 

Thursday, 14 March 2019

జడ"కందాలు" - 5858: పురుష "జడకారులు". 

వివిధములగు జడలల్లుట 
యువిదలకే చెల్లుననెడు యుక్తులు మేలా? 
దివి భామల జడసొగసులు 
భువి కన్నెల కిచ్చునట్టి పురుషుల గనరే!

Wednesday, 13 March 2019

జడ"కందాలు" - 57

57:జడనల్లుటనెరుగవా  


గుడిలేని పల్లె, చదువుల
బడియేలెనట్టియూరు, పదుగురికోసం
మడి దున్నని రైతు, తలను 
జడ నల్లుట తెలియనట్టి జాణలు వ్యర్ధం.

Tuesday, 12 March 2019

జడ"కందాలు " - 56 `

56: పూవుల కోరిక 


కొమ్మకు బూచిన పూవులు 
'కొమ్మల'కే ననుచు తాము గోరుచు మరి చే 
కొమ్మని, తమదరి రాగా 

కొమ్మల జడవైపు జూచి కోరిక రేపున్.

Monday, 11 March 2019

జడ"కందాలు" - 55


55: స"వరం" ఉందిలే 


జడ తక్కువ గల రాణీ!
జడవకుమా పెద్దజడకు సవరము కలదే
మెడనుండి నడుము దాకను
విడిపోకనె నిలచియుండి విసవిస యూగున్.

Sunday, 10 March 2019

జడ"కందాలు" - 54

54.విను పూబోణీ  


ముందున్న ముఖమె పద్మము 
అందంబుగ నున్న కన్నులవి కలువలెగా  
యందమ్ము వెనుక జూపగ 
నందిన విరులెల్ల నింపుమా జడ సుదతీ!    

Friday, 8 March 2019

జడ"కందాలు" - 53

53:జడ దయ

జడ! నీ యడ్డము తొలుగక 
పడతులు నిను బ్రతిమలాడి  పైకనకున్నన్ 
మెడవంచి వధువు మ్రొక్కక 
పుడమిని ముడివేయ గలడ  పుస్తెన్  వరుడే ?  

జడ"కందాలు" - 5252: పోనీటైల్ గర్ల్  


వాటీజ్ దిస్ జడ, సీ ఐ 
హేటిట్ డోంట్ టై ద హెయిరు  హే!హే!ట్రై పో   
నీటైల్ అండ్ బాబ్డు హెయిరు  
నీటై వ్యూయర్సు మెచ్చు నిన్నే మైగర్ల్.  

Thursday, 7 March 2019

51 - జడ"కందాలు"


51.అక్కనేల్పిత్తా 

అత్తా పూలిత్తావా! 
ఇత్తా జల్లోన పెత్తి  ఇంతికి పోతా  
త్తిచ్చిందని నే నే 
ల్పిత్తాలే అక్కనిత్త "వెవ్వెవ్వెవ్వే!" 

Wednesday, 6 March 2019

జడ"కందాలు" - 50

50 - అమ్మలు జల 

అమ్మా జల యేత్తావా!
తమ్ములు నా జుత్తులాగి తంతున్నాలే!
అమ్మమ పువ్వాయిని చి
న్నమ్మయె గ్లీన్ లిబ్బనొకతి నాకిచ్చాలే! 

Tuesday, 5 March 2019

జడ"కందాలు" - 49

49.జానెడు జడ ఓదార్పు. 

 "తేలే" చిటికెడు మస్తౌ 
తేలేదని షాంపులెన్నొ తిట్టదు నిన్నే  
పూలే బెత్తెడు జాల్తయ్
"జాలీ"యే జాలి పడకు జానెడు జడతో.

Monday, 4 March 2019

గిరిధర హితుడా!ఓం నమశ్శివాయ.

అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.  Image result for siva images


కందము: 
పురహర!భవహర!శుభకర!
గిరిసుతధవ! ధవళ రుచిర! గిరిధర హితుడా!
సురనర ఘనయసుర వినుత! 
మరిమరినిను మదినిదలతు మలినరహితుడా! 

జడ"కందాలు" - 48

48 - చిన్నిజడ చిన్నమ్మ ఫీలింగ్

జర్రంతే "తేల్" జాల్తది
వర్రీలింతైన "నక్కొ" ,  పైసల్ కొన్నే 
సర్రున దువ్కొని "జల్దీ"  
బర్రున చిన జడతొ "వీజి" బాజార్ జానా . 

Sunday, 3 March 2019

జడ"కందాలు" - 4747.ఛోటీ జడ పోరీ పోరు. 

జానా బెత్తెడు జడ బస్
జానేదో, లాంగు లాంగు జడ చల్తా నై
నేనే మానుత బిగ్ జడ 
మైనే మాన్ తా హు ఛోటి మస్తీ జడకో. 

Saturday, 2 March 2019

జడ"కందాలు" - 46


46.పొట్టిజడ అదిఒకందము 

జడ పొట్టిగ బాగుంటది 
గెడలా పొడుగెందుకంట, గ్రేటా! లే!లే! 
ముడికందితె జాల్ బస్!బస్! 
గడియల్ బడి దువ్వనీకి గది ముష్కిల్!ఔ!   

Friday, 1 March 2019

జడ"కందాలు" - 45


45.జడను అల్లే విధానం 

తలపాపట దీయగనే
తల వెనుకకు జుట్టు దువ్వి తడుముచు వ్రేళ్ళన్
గలియగను మూడు పాయలు
మెలిదిప్పుచునల్ల క్రిందమీదన జడయౌ.