తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday 28 February 2019

సీతాపతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 02 - 2019 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - సీతాపతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా

కందము: 
ఖ్యాతినిగనె సతికిని తా
ప్రీతిగ సగమిచ్చి మేను ప్రియ ధవుడగుచున్
ఏతావాతా దేలెను
సీతా! పతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా!

సీతాపతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 02 - 2019 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - సీతాపతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా

కందము: 
ఖ్యాతినిగనె సతికిని తా
ప్రీతిగ సగమిచ్చి మేను ప్రియ ధవుడగుచున్
ఏతావాతా దేలెను
సీతా! పతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా!

జడ"కందాలు" - 44



44.విరబోయకు


విరబోయకుమీ కురులను
విరబూయవు మీకు సిరుల విరులెప్పటికిన్
మరియాద పెరుగు జడతో
మరి"యాదుకు" దెచ్చుకొనుము మంచిగ జెపితిన్.

Wednesday 27 February 2019

జడ"కందాలు" - 43

43.జడ గంటలు

గుడిలో గొట్టిన గంటలు
సడిజేయగ మదిని రేగు శంకరు తలపే
జడకే కట్టిన గంటలు
సడిజేయక మదిని రేపు జక్కని వలపే.

Tuesday 26 February 2019

జడ"కందాలు" - 42


42.పూలుపెడితే పేలు రావు 


తల "పేలే" పెరిగెను,  జడ 
తలపే లేదనుచు జెప్పి తా వాపోవన్ 
తలపూలు పెట్టు కొమ్మని 
తలపులు బాగుండు ననుచు దాదీ చెప్పెన్ 

Monday 25 February 2019

మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 02 - 2019 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్.


కందము:
వనమున సతికడ ముదముగ
ననుజునితో గూడియున్న యానళినాక్షున్
ఇనకుల తిలకుని యారా 
మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్.


జడ"కందాలు" - 41


41.కొమ్మల తలపైన

కొమ్మను వీడిన విరి చే
కొమ్మని నరు బ్రతిమిలాడు “గూర్చుము హాయిన్ 
యమ్మ పదములను లేదా  
కొమ్మల తలపైని జడను గూర్చొననిమ్మా!”  

Sunday 24 February 2019

జడ"కందాలు" - 40


40.పూల గుసగుస 

గుడి దేవతలను జేరగ 
వడిబూయుచు పూవులన్ని వసుధను గోరున్ 
జడయున్న తలను జేరగ 
గుడితదుపరి పదిలమనుచు గుసగుసలాడున్.

Saturday 23 February 2019

జడ"కందాలు" - 39


39.పూజడ ఫోటో. 

అద్దిరబన్నా!నిలచిన
దద్దమునకు ముందు బాల, తన పూజడనే   
ముద్దుగ "ఫోటో" దీయగ 
పెద్దగనౌ పిదపగూడ ప్రియముగ జూడన్. 

Friday 22 February 2019

జడ"కందాలు" - 38


38.బుట్టెడు పూల జడ

బుట్టెడు పూవులు జేరెను  
కట్టగ నాపూలజడను, కలభాషిణికిన్  
పుట్టెడు నవ్వులు బూచెను  
'కట్టగ' నవిజేరె లసి కన్నులలోనన్.

Thursday 21 February 2019

జడ"కందాలు"- 37



37.పూలజడ జ్ఞాపకాలు

తల నిండెను పూవులతో 
తలపులవే నిండిపోయె తన్మయ సుధలన్ 
శెలవిచ్చెను పూజడయే 
నిలువెత్తగు జ్ఞాపకముగ నేనుందుననెన్.

Wednesday 20 February 2019

జడ"కందాలు" - 36


36.అమ్మాయి జడ  

తల మొట్టి యమ్మవేసెన? 
తలపెట్టుచు నీవెయడిగి తలనిచ్చితివా 
తెలి మల్లెపూల జడతో 
తెలుగింటికి(తెలుగింతికి) తీపిగుర్తు తెలిపితివమ్మా! 

Tuesday 19 February 2019

జడ"కందాలు" - 35


35.తెల్లనాగు జడ.

పట్టు పరికిణీ జాకెట్ 
ట్టిన తెలుగింటి బాలికకు పూజడ గన్
పట్టెను తెల్లని నాగుగ 
నిట్టే యాశీర్వదింప నిలచిన దేమో! 

Monday 18 February 2019

జడ"కందాలు" - 34


34.జడ "క్రీడలు"'



జడ తలపై 'చుట్టగ'నగు 
జడ 'చెండును' ప్రణయకలహ సమయములందున్
జడ 'దిండగు' నపుడప్పుడు
జడ 'చెండును' బెట్టినపుడు సరి నగుచుండున్.

Sunday 17 February 2019

జడ"కందాలు" - 33


33.జడపోషణ ఎలా 

జడబెంచును పడతియె మరి  
జడ తైలము లెన్నొగొనుచు జక్కగ ప్రేమన్  
జడిపించెడు జడగని పతి 
"ముడితైలము" డబ్బులేక ముడివేయమనున్.

Saturday 16 February 2019

జడ"కందాలు" - 32



32.నా కందము జడ నాకందమనె. 

నే కందము వ్రాసినచో 
నాకందము బెరుగునంచు ననె జడ, యిదిగో 
నా కందము చూపెదనిక 
నాకందుము కందమందు నంటిని జడనే.



Friday 15 February 2019

జడ"కందాలు" - 31


31.జడ థ్రిల్ "మిస్సు."
జడ "నిల్లన" పని "లెస్సనె"
మెడవరకే "బాబ్డు హెయిరు" మిస్సుకు, మిస్సౌ
జడ "థ్రిల్లును", "గ్రోమోరని"
నడుమందగ బెంచమనుచు నడుగుట మేలా?

Wednesday 13 February 2019

జడ"కందాలు" - 30

30.కృష్ణునికైనా జడంటే...

హరి రుక్మిణి జడలో నొక
విరి దురుమగ వచ్చెజిక్కు, వేడుచు భామన్  
సుర తరువును దెచ్చెదననె
మరి జడయన భయము గలిగె మాధవు కైనన్. 


Tuesday 12 February 2019

జడ"కందాలు" - 29


29.ఏ వయసునకాజడ.

బుడిబుడి నడకల ముడిజడ
నడువగ బడికటు బిగువుగ నటునిటు పిలకల్
వడి నడి వయసున నొకజడ
పడతికి నుడిగిన జడలిక పడవుగ, ముడులే.

Monday 11 February 2019

జడ"కందాలు" - 28



28.క్రేజీ గర్ల్ మాట. 

ఈజీ యల్లిగ గాదులె
యీజీవికి జడల? పొట్టి హెయిరే బెటరౌ
క్రేజీగా దువ్వుట స్టైల్
లేజీ గర్లని తలపకులే యిటు బలుకన్.

   

Sunday 10 February 2019

జడ"కందాలు" - 27


27.జడ"కందము"  

జడపిన్నులు జడక్లిప్పిలు 
జడరబ్బరుబ్యాండ్లు జూడ జడరిబ్బన్లన్ 
జడగంటలు చెంపసరాల్  
జడపాపిట బిళ్ళలనిడ  జడ"కందమగున్." 

Saturday 9 February 2019

జడ"కందాలు" - 26


26. గుడి వంటి జడముడి.   

గుడిశెలు కొలదిగ యున్నను  
గుడియున్నచొ వాడ వెలుగు క్రొత్తగ, కురులే 
పడతికి గొన్నియె యున్నను    
ముడియున్నచొ జడనుజూడ ముచ్చటగొలుపున్. 

Friday 8 February 2019

"గోలీ"లు - 1



చక్కటి "పోస్టును" "లైకక"
చిక్కటి "కామెంటు" వెట్ట జేరని వారిన్
లెక్కకు మిక్కిలి వద్దని
గ్రక్కున "నన్ ఫ్రెండు"జేయ గావలె గోలీ.

జడ"కందాలు" - 25


25.విరబూసిన జడ.

విరబూసిన కలువల వలె  
విరిమాలలు వెట్ట జడలు వేడుక గొలుపున్   
విరబోసిన తలలనుగన 
విరివిగనే బామ్మ తిట్టి వింతగ 'దులుపున్'.  

Wednesday 6 February 2019

జడ"కందాలు" - 24


24.రామయణంలో జడ మహిమ..

జడలో చూడామణినే
ముడి దూర్చకయున్న, సీత మురిపెపు గుర్తున్
పడిపడి వచ్చిన హనుమకు
నడుగగనే యేమియిచ్చు నది జడ మహిమే.

జడ"కందాలు" - 23



23.కొమ్మకు పూచిన పూవు. 

కొమ్మకు పూచిన విరి, చే
కొమ్మని గుడినుంచమనుచు కోరుచునుండున్
కొమ్మకు వేసిన జడయే
కొమ్మగ నేనుంటి పూవు  కోయుండనుగా .

Tuesday 5 February 2019

జడ"కందాలు" - 22


22.కడవలకొద్దీ నీరు లేకపోతే చిక్కే. 

కడవను కొద్దిగనీరే 
జడశుభ్రము జేయబోగ జాలవు, చిక్కే!
కడవలకొద్దీ నీరే
వడి  బోయగ శుభ్రబడుచు వదలును చిక్కే.

Monday 4 February 2019

రారమ్మని పిలిచె సాధ్వి రంజిల విటులన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 4 - 02 - 2019 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


సమస్య - రారమ్మని పిలిచె సాధ్వి రంజిల విటులన్.


కందము: 
పేరును వెట్టిరి బిడ్డకు
తీరుగనే మంచిపేరు తెచ్చునటంచున్ 
మారెను జాతకమామెది 
రారమ్మని పిలిచె "సాధ్వి" రంజిల విటులన్.

జడ"కందాలు" - 21


21.జడనల్లగ చిక్కులే. 

చక్కటి జడ కావలసిన 
చిక్కును తొలగించవలయు సిగలో, నపుడే 
చిక్కును చేతికి నల్లగ  
చక్కగ, నల్లగ నిగనిగ జడ గనపడుగా. 

Sunday 3 February 2019

జడ"కందాలు"- 20


20. జడ స్నానం.  

వేణీ స్నానమునకు  పూ 
బోణీ ! వేణ్ణీళ్ళు వలయుపో,  పిదపన్ సాం 
బ్రాణీ పొగయే  గావలె 
రాణీ ! యిక  జడను వేయ రంజుగ నుండున్.

Saturday 2 February 2019

జడ"కందాలు" - 19


19.అందుము మా 'కందము'గా.

అందుము జడ! నీగొప్పల
నందుము మా 'పద్యములకు' నందముగానే  
కందములే యల్లెదమిక  
కందములే!వందలైన గదలక వ్రాయన్.    

Friday 1 February 2019

జడ"కందాలు"- 18


18.గుండెలమధ్య జడ హొయలు. 

కొండల మధ్యన నాడుచు   
మెండుగ నా 'కృష్ణవేణి' మెరయుచు దలున్ 
కొండల మధ్యన నాడుచు   
మెండుగ నీ కృష్ణ'వేణి' మెరయుచు దలున్.