చంద్రయాన్ - 3 విజయం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలు అందరికి అభినందనలు.
కందము:
ఇస్రో కో జయ్ జయ్ హో
ఇస్రోజ్ భారత్ కొ బహుతు యిజ్జత్ బఢెహై
ఇ స్రోనే దేశోం కో
ఛ స్రోనేదో హమార శాల్యూట్ లేలో!
---గోలి.👏👍🙂
తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
చంద్రయాన్ - 3 విజయం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలు అందరికి అభినందనలు.
కందము:
ఇస్రో కో జయ్ జయ్ హో
ఇస్రోజ్ భారత్ కొ బహుతు యిజ్జత్ బఢెహై
ఇ స్రోనే దేశోం కో
ఛ స్రోనేదో హమార శాల్యూట్ లేలో!
---గోలి.👏👍🙂
కందము:
పిల్లలు పెనిమిటి గలిగిన
ఇల్లాలే యిలను జూడ నింటికి వెలుగౌ
ఇల్లాలు "వెల్" గ లేదా
"ఇల్లాల్" గామారుదురిక నింటను గోలీ.
కందము:
పర పతి గూడుట మరియున్
పర సతినే గూడుటయు "యెఫైరది" భువిలో
పరగన్ చెడుగతి యగునది
పరపతి నేగాల్చుటకు "యె ఫైరది" గోలీ!
8-8-2023 న "శంకరాభరణం"నందు ఇచ్చిన సమస్యకు నా పూరణ.
ఒక చోరుని స్వగతము.
కందము:
పోవలె,శిఖరాగ్రముపై
కావలి లేనట్టి కోట కలదులె, నిధులే
కావలె, త్రవ్వగ నట నా
దేవుఁడు లేనట్టి గుడియె తీర్చును గోర్కెల్.
కందము:
"నీ కొండకు నీవే" యని
యా కొండలరాయని మదినార్తిగ వేడన్
తా కొండకు రప్పించుక
చేకొనుచును మ్రొక్కులన్ని చేయూతనిడున్.