తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday, 8 November 2026

దీపపర్వ కాంతి

 మీకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు .

సీసము:
చేయి కాల్చుకొనక చేరి జాగ్రత్తగా
కాకర పూవొత్తి కరము గాల్చు
చిరు నిప్పురవ్వలే చింది మీదకు రాక
చిచ్చుబుడ్డిని మది మెచ్చ గాల్చు
కర్ణభేరి మిగుల కంపించి ప్రేలక
వంకాయ బాంబులన్ వరుస గాల్చు
మీదకు రాకుండ మీదికే సాగగా
ఎగయు తారాజువ్వ నెరిగి కాల్చు
తిరుగువేళను పైకి చరచరా రాకుండ
విష్ణు, భూ చక్రముల్ ప్రియము గాల్చు
బాటసారులమీద వాలకుండుగనట్లు
"థౌజెండు వాలా"లు దారి గాల్చు
కళ్ళు, నొళ్ళుయు నిల్లు కాలకుండుగనట్లు
శక్తి "కొలదిగ" క్రాకర్సు గాల్చు
అతినిజేయ, నదియె యప్రమత్తత వీడ
వినుమ నీ భవితనే విధిగ గాల్చు
ఆటవెలది:
ప్రమిదలన్ని వెలుగ వరుసగా నుంచగా
దీపపర్వ కాంతి తీరు నిల్చు
సత్యభామ ప్రియుడు సంతుష్టి జెందుచు
చల్లగాను జూచి సరిగ గాచు.