తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
Thursday, 24 September 2026
Tuesday, 15 September 2026
శ్రీ గజానన!
ఓం శ్రీ మహా గణపతయే నమః
మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
సీసము:
శ్రీగజానన! బుద్ధి, సిద్ధినాథుడవయ్య!
పరగ నా గణపతి పదవి నీది
మంత్రమందు మొదటి మహిమాక్షరంబైన
ప్రణవమై వెలుగొందు వాసి నీది
కనులు చిన్నవిగాని కరుణనే పెద్దగా
మాపైన కురిపించు చూపు నీది
మరి శ్రద్ధగా నీవె మాగోడులన్ విన
చేటలంతగనున్న చెవులు నీవి
సకలవిద్యలనెల్ల సంప్రీతినందించ
కోరిదాచిన పెద్ద కుక్షి నీది
ఆశీస్సులీయగా, నణగంగ ద్రొక్కగా
గరిమ గల్గినయట్టి కరము నీది
పసుపు ముద్దనుజేసి భక్తితో రమ్మన
సరగునన్ వచ్చెడి జాలినీది
గరికనింత నిడుచు వరములన్ గోరిన
ఇలను జనులకిచ్చు ఎలమి నీది
ఆటవెలది:
అట్టి నిన్ను మదిని యర్చించి వేడగా
విజయమందు, నన్ని విద్యలందు
ఉజ్వలంపు భావి యొనగూరునని లోక
విదితమనుచు దెలిసి వినుతి జేతు.
Monday, 7 September 2026
Sunday, 30 August 2026
Monday, 24 August 2026
Thursday, 20 August 2026
Monday, 17 August 2026
Sunday, 2 August 2026
Sunday, 26 July 2026
Friday, 19 June 2026
Tuesday, 16 June 2026
Saturday, 30 May 2026
Friday, 17 April 2026
Friday, 27 March 2026
రామా! రావయ్యా
శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః
మీకు అందరికీ
శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
కందము:
ముదమున నిను మది దలచుచు
పదముల వదలక గొలిచెద వడి రావయ్యా!
సదయుడ రామా! నిను గని
పదపడి మాపైకి వెతలు పడి రావయ్యా.
Thursday, 19 March 2026
రా! పరాభవా!
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
(డిశంబరు, జులై, మార్చి, మే - అను ఇంగ్లీషు నెలల పేర్లను వాడుతూ తెలుగు సంవత్సరాదికి చెప్పిన స్వాగత పద్యం)
ఉత్పలమాల:
సాగిలి మ్రొక్కి భీతివిడి శంబరువైరికివైరి శంభుకున్
ఈ గతినుండె నామమని నెన్నక, భావిని మంచి రోజులై వేగమె నిన్నమొన్న గత పీడలకాలము మార్చివేయగా
స్వాగతమేను జెప్పెదను సత్ఫలమీయగ రా! పరాభవా!
Wednesday, 18 March 2026
Friday, 27 February 2026
Sunday, 15 February 2026
"సగము"వాని
ఓం నమశ్శివాయ.
మీకు మీ కుటుంబసభ్యులకు అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.ఆటవెలది:
ఏమి "లేని"వాని నెన్న "సున్న"గు వాని
"సగము" కలుపుకున్న "సగము"వాని
కలసి యొక్కటైన "కలవాని" "పూర్ణ"మై
నిలచునెవడొ? వాని నేనుగొలుతు.
Thursday, 5 February 2026
Saturday, 31 January 2026
Tuesday, 20 January 2026
Thursday, 15 January 2026
సంక్రాంతి పండుగ
అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.
వసంతమంజరి:
వెలుగు రంగుల మ్రుగ్గు లిల హరివిల్లులన్ తల పించగా
చలియు నెండల మేలు కలయిక చాల హాయిని గూర్పగా
తెలుగు లోగిలి లోన మనసుల తీపి భావము నింపగా
కలుములీయగ భోగి తదుపరి క్రాంతి పండుగ వచ్చెగా.
Wednesday, 14 January 2026
Monday, 5 January 2026
Thursday, 1 January 2026
ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
మీకు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
కందము:
విజయము సిధ్ధించుచు మీ
"విజన్సు" ఉజ్వలముగ నిల విదితమ్మగుచున్
నిజముగ "న్యూ యియ"రందున
సజావుగను సుఖము శాంతి శుభమందవలెన్.