తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday, 30 November 2016

బ్రాహ్మణుండు మాంసభక్షకుండు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  01 - 11 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - బ్రాహ్మణుండు మాంసభక్షకుండు.ఆటవెలది: 
స్నేహమునకు లేవు చిన్న,పెద్దలనుచు 
ప్రాణమిత్రులైరి పాఠశాల 
శాకపాకములను చప్పరించి దినెడు
బ్రాహ్మణుండు, మాంసభక్షకుండు.

Tuesday, 29 November 2016

మత్స్య యంత్రమ్ము గొట్టెను మాద్రి సుతుడు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  29 - 10 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మత్స్య యంత్రమ్ము గొట్టెను మాద్రి సుతుడు. 


తేటగీతి: 
మనసు దలచెను నకులుడు మంచిగాను
హాయి చప్పట్లు గొట్టెద నర్జునుండు 
గొట్ట నాయంత్ర, మనునంత గొట్టె గ్రీడి
మత్స్య యంత్రమ్ము, గొట్టెను మాద్రి సుతుడు. 

Monday, 28 November 2016

మన్మథుండు ముక్కంటికి మాతులుండు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 10 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మన్మథుండు ముక్కంటికి మాతులుండు.


తేటగీతి: 
హరికి పుత్రుండు చూడగా నాతడెవరు
విస్ణువెవరికి మిత్రుండు వేగ జెపుమ 
కంసుడెవ్వరు శ్రీకృష్ణుకంటి, వరుస
మన్మథుండు, ముక్కంటికి, మాతులుండు

Sunday, 27 November 2016

బుద్ధుఁడు హింసయె హితమని బోధించె నిలన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  25 - 10 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - బుద్ధుఁడు హింసయె హితమని బోధించె నిలన్.


కందము: 
"బుద్ధుడు" కు కొమ్ము లేదుర 
"బుద్ధుడ" తలకట్టు చాలు బుద్ధిగ వినుమా 
దిద్దుము ముందీ వాక్యము 
"బుద్ధుఁడు హింసయె హితమని బోధించె నిలన్".

Saturday, 26 November 2016

రాక్షసుఁడు రచించె రామకథను.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 10 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రాక్షసుఁడు రచించె రామకథను.


ఆటవెలది: 
రామ చరిత నేను రమ్యంబుగా వ్రాసి 
కంద పద్యమందు కాగితమున 
చూప స్నేహితులకు, చూడక నొక్కడు 
రాక్షసుఁడుర, చించె రామకథను.

ఆటవెలది:  
రామ చరిత నేను రమ్యంబుగా నొక్క 
కంద పద్యమునను కవిత వ్రాసి 
చూప స్నేహితుకు చూచి మెచ్చి పలికె 
" రాక్షసుఁడుర, చించె రామకథను ".

Friday, 25 November 2016

కారు - లారి - జీపు - వ్యాను...భారతార్థంలో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 10 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రాక్షసుఁడు రచించె రామకథను.


ఆటవెలది: 
రామ చరిత నేను రమ్యంబుగా వ్రాసి 
కంద పద్యమందు కాగితమున 
చూప స్నేహితులకు, చూడక నొక్కడు 
రాక్షసుఁడుర, చించె రామకథను.

ఆటవెలది:  
రామ చరిత నేను రమ్యంబుగా నొక్క 
కంద పద్యమునను కవిత వ్రాసి 
చూప స్నేహితులకు చూచి మెచ్చి పలికె 
" రాక్షసుఁడుర, చించె రామకథను ".

Thursday, 24 November 2016

పురుషుడు పసుపాడి ముడిచెఁబూమాలనొగిన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  10 - 10 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పురుషుడు పసుపాడి ముడిచెఁబూమాలనొగిన్.


కందము: 
దొరకగ నేకాంతమ్మే
దొరసానీ యనుచు రేయి దోబూచులకై 
దరిజేరుననుచు సతి తన   
పురుషుడు, పసుపాడి ముడిచెఁబూమాలనొగిన్.

Wednesday, 23 November 2016

రాముఁడేలి నాడు రోము ప్రజల.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  06 - 10 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రాముఁడేలి నాడు రోము ప్రజల. 


ఆటవెలది: 
వ్రాత తప్పుజరిగె బ్రాకెట్లనుంచితి
"మూ" ను దీసి చదువ ముద్దుగుండు 
పుడమి జనులు మెచ్చ పుణ్యపురుషుడైన 
రాముఁడేలి నాడురో (ము) ప్రజల. 

Tuesday, 22 November 2016

ఆడువారు బొంకు లాడువారు.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  20 - 09 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - ఆడువారు బొంకు లాడువారు.ఆటవెలది: 
ఉర్వికింత గూడ నుపయోగ పడబోరు 
జీవితమున పైకి చేరిపోరు 
పైకి మంచి తనము పాటించి నాటకా 
లాడువారు బొంకు లాడువారు.

Monday, 21 November 2016

భక్షించెను గోవుఁ జంపి పాప మెటు లగున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 09 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - భక్షించెను గోవుఁ జంపి పాప మెటు లగున్. కందము: 
రక్షించెద నే జూచిన 
నక్షికి నగుపడగలేదు హరిహరి ! హరియే 
కుక్షిని నింపగ తానే 
భక్షించెను గోవుఁ జంపి పాప మెటు లగున్.

Sunday, 20 November 2016

చట్రాతిని నారఁదీయఁ జయ్యన వచ్చున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  03 - 09 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - చట్రాతిని నారఁదీయఁ జయ్యన వచ్చున్.కందము: 
కోట్రెడ్డి నానబెట్టెను
పట్రాయని వాగులోన వాటెడు గోగున్
పేట్రేగి లాగి బాదుచు
చట్రాతిని, నారఁదీయఁజయ్యన వచ్చున్.

Saturday, 19 November 2016

కష్టం బవధానవిద్య కాదనిరి కవుల్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  01 - 09 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - కష్టం బవధానవిద్య కాదనిరి కవుల్.


కందము:  
నిష్టను భారతి దలచుచు 
శిష్టుల సాంగత్యమంది చేయుచు గోష్టుల్
స్పష్టముగ భాషదెలిసిన 
కష్టం బవధానవిద్య కాదనిరి కవుల్.

Friday, 18 November 2016

ఒకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  31 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఒకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్. 


కందము:
చకచక గీసెను బొమ్మల
నొకటగు గ్రహణమ్ము జూప నొక "ఎగ్జాం " లో    
సుకుమారి కాగితమ్మున 
నొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్.

Thursday, 17 November 2016

యమ(హ) వాహనం

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - యమ(హ) వాహనం తేటగీతి: 
యమహ వాహనమెందుకు "యాక్కు"! వద్దు 
యముని వాహనమే ముద్దు    యమగనుండు 
నడుగువేయును తైలమ్ము నడుగకుండ 
గడ్డిమేయుచు మోయు మార్గమున నన్ను.

Wednesday, 16 November 2016

ముండను వీక్షించి మగఁడు మోదము నందెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ముండను వీక్షించి మగఁడు మోదము నందెన్.  


కందము:
పెండిలినాటివి చిత్రము
లండీ ! యని కళ్ళజోడు నాలందించన్ 
మెండుగ గన చత్వార
మ్ముండను, వీక్షించి మగఁడు మోదము నందెన్.

Tuesday, 15 November 2016

లంగా - లుంగీ - చీర - దోవతి....భారతార్థంలో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  25 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది: లంగా - లుంగీ - చీర - దోవతి....భారతార్థంలో


రాయబార ఘట్టమున శ్రీకృష్ణునితో దుర్యోధనుడు.

కందము:  
చీల దొంగా ! నీవిక  
తీరుగ వెనుదిరిగి దోవ తిన్నగ జనుమా 
వారుబలంగా నున్నను 
కౌరవులము విరువగలము కాలుంగీలున్. 

Monday, 14 November 2016

పడుచున్నను పెండ్లియాడువారే లేరే

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - పడుచున్నను పెండ్లియాడువారే లేరే


కందము: 
గుడిలో నర్చకునైతిని 
గడియించితి బాగుగానె, గనుచును పిలకన్ 
పడుచొకరు వయసు మీదను 
పడుచున్నను పెండ్లియాడువారే లేరే!

Sunday, 13 November 2016

కుచ్చిళ్ళనెత్తు చిరు భంగిమలే

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - కుచ్చిళ్ళనెత్తు చిరు భంగిమలేకందము: 
చీరెను గట్టుక నడచిన 
చేరుచు కుచ్చిళ్ళనెత్తు చిరు భంగిమలే
మీరుచు కనులకు విందగు 
సారీ ! మీ జీన్సునందు సరిగానములే.

Saturday, 12 November 2016

కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  23 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్.


కందము: 
'కుక్కును' వంటకు బెట్టెను
చక్కనిదని 'లవ్వు'జేసె చందూ, రావే 
కుక్కాయనులే ముద్దుగ 
కుక్కకుఁ దలఁబ్రాలు వోయు కుతుకము గలిగెన్.

Friday, 11 November 2016

మార్గము శుద్ధిజేయు మార్గము.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  23 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - మార్గము శుద్ధిజేయు మార్గము. 


కందము: 
దుర్గంధము తోనిండిన
మార్గమ్ముల శుద్ధిజేయ మహిదలచెన, ఆ
స్వర్గమ్మునుండి గంగను
భర్గుని వేడుచును దెచ్చి పారించెనిటన్.

Thursday, 10 November 2016

భారతయుద్ధమున నయ్యొ పార్థుం డోడెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - భారతయుద్ధమున నయ్యొ పార్థుం డోడెన్.కందము: 
కౌరవుల "వ్యూహమున" బడి
జేరగ నా వ్యూహమందు చెంగట లేకన్ 
తీరుగ సుతు రక్షణలో 
భారతయుద్ధమున, నయ్యొ పార్థుం డోడెన్.

Wednesday, 9 November 2016

భర్తృరహిత సంతుఁ బడసి మురిసె.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  16 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - భర్తృరహిత సంతుఁ బడసి మురిసె.ఆటవెలది: 
శ్రీమతికిని నాడు సీమంతమేజేసి 
'కార్గి' లనిని  బోరి స్వర్గమేగ 
పతియె మరల బుట్టె బాలునిగానని  
భర్తృరహిత సంతుఁ బడసి మురిసె.

Tuesday, 8 November 2016

పసిబాలుడు పెండ్లియాడి పడసె కుమారున్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  12 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పసిబాలుడు పెండ్లియాడి పడసె కుమారున్.


కందము: 
కొసరాజు బాలచంద్రుం
డసమానుడు చదువులోన, నణకువలోనన్ 
వ్యసనములు లేని కడు రూ 
పసి, "బాలుడు " పెండ్లియాడి పడసె కుమారున్.

Monday, 7 November 2016

శ్రీరమణీ లలామ నెదఁజేర్చిన వాఁడు శివుండె శంభుఁడే.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  10 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శ్రీరమణీ లలామ నెదఁజేర్చిన వాఁడు శివుండె శంభుఁడే.


ఉత్పలమాల: 
శ్రీరమ విష్ణుమూర్తి దరి జేరుచు బల్కెను నాథ! చెప్పుమా 
మీ రమణీయ వక్షమున మిన్నగ నుందును నేను, డెందమున్
జేరుచునెవ్వరుండునన జెప్పెను నవ్వుచు లోకనాథుడా 
శ్రీరమణీ లలామ నెదఁజేర్చిన వాఁడు, - " శివుండె శంభుఁడే ".

Sunday, 6 November 2016

బట్టలు లేకుండఁ దిరుగువాఁడె సుజనుఁడౌ.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  09 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - బట్టలు లేకుండఁ దిరుగువాఁడె సుజనుఁడౌ.


కందము: 
కొట్టినటులుండు మాటలు 
ముట్టిన దూరంబనుచును మూతి విరుపులున్ 
తట్టెడుకుళ్ళును, చిరిగిన 
బట్టలు, లేకుండఁ దిరుగువాఁడె సుజనుఁడౌ.

Saturday, 5 November 2016

మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  07 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్.కందము: 
మానుము చాడీల వినుట 
మానము లేనట్టి వేళ మననొల్ల సఖా ! 
మానిన ముదమిరువుర కను 
మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్. 

Friday, 4 November 2016

పండు తాంబూలం

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  06 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - పండు తాంబూలం 

తేటగీతి: 
ఆకులందున పోకల నమరజేసి
ఫలము లెవియైన నుంచుచు పళ్ళెమందు
ముత్తయిదువుల కీయగ ముదితలెల్ల
పండు తాంబూల మను నోము, ఫలమునిచ్చు.

Thursday, 3 November 2016

సంజీవని నంగదుండు సరగునఁ దెచ్చెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  05 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సంజీవని నంగదుండు సరగునఁ దెచ్చెన్.


కందము: 
వింజామరలను తెమ్మన 
కంజదళాక్షుడు ముదమున గగనమునందే 
అంజన సుతు చేతను గని 
సంజీవని, నంగదుండు సరగునఁ దెచ్చెన్.

Wednesday, 2 November 2016

గొట్టపు వాసము

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  05 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.వర్ణ (న) చిత్రం - గొట్టపు వాసముకందము: 
గొట్టపు వాసమునే పడ 
గొట్టుట నీ చేత గలదు గురుతెరుగమ్మా 
కట్టెదము మంచి యింటిని
పట్టుదలను బాగచదివి పైకెదిగినచో.

Tuesday, 1 November 2016

భార్య మరణించినంత సంబరము గలిగె.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  04 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భార్య మరణించినంత సంబరము గలిగె. 


తేటగీతి: 
దుస్స సేనుని గుండెను లెస్స జీల్చి
కురుల రక్తము బూయగ కోరె నాడు 
వాని భీముడు చంపనా వార్త వినెను 
భార్య, మరణించినంత సంబరము గలిగె.