తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 31 May 2014

చెక్కభజన

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం -  చెక్కభజన 


 














కందము:
చక్కని ఆహార్యము తో
తక్కాతకతకిట తకిట తాళము వేయన్
పెక్కురు గజ్జెలు గట్టుక
చెక్కలు మ్రోగించు విధమె చెక్కభజనలౌ. 

Thursday 29 May 2014

హ్యా పీ న్యూ యియ రటన్న నాగ్రహ మొందెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - హ్యా పీ న్యూ యియ రటన్న నాగ్రహ మొందెన్.

కందము:
పాపయ్యకు వచ్చెను  చెము
డీ పూటనె దెచ్చినాడు 'యియరుకు మిషనే'
గోపయ్య కలసి "హల్లో"
హ్యా పీ "న్యూ యియ"   రటన్న నాగ్రహ మొందెన్.

Wednesday 28 May 2014

పద మూడ "గ" వత్సరమా ...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 01 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - పద మూడ "గ"  వత్సరమా ...



 












కందము:
పద మూడవ వత్సరమా
పదవిని చేకొన్న నీకు స్వాగతమయ్యా !
పద మూడగ ముష్కరులకు
పద,  విని మామొరలు నీవు పాలించుమయా !

Tuesday 27 May 2014

శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్.


కందము: 
భవరోగమె బాగుందని
లవలేశము మందు వలదు, లంపటమందే
జవ సత్వము కలదనగా
శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్.

Monday 26 May 2014

షూటింగ్...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన చిత్రం - షూటింగ్... .


 
















 


తేటగీతి:
పంచ రంగుల మెరసెడి  పక్షులార
ఏమి చూచుచు నుంటిరో ఎక్కి కొమ్మ
'షూటు ' జేయగ జూతురు చూచువారు
కనుడు జాగ్రత్తగానది  కన్నొ ? గన్నొ ? 


కన్ను = కెమెరా

Sunday 25 May 2014

ఎవఁడో యెవ్వఁడొ యెవ్వఁడో యెవఁడొ తానెవ్వాఁడొకో యెవ్వఁడో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - ఎవఁడో యెవ్వఁడొ యెవ్వఁడో యెవఁడొ తానెవ్వాఁడొకో యెవ్వఁడో


వెన్నదొంగ గురించి గోపికల ముచ్చట్లు...

మత్తేభము:
నవనీతంబును దొంగిలించె నెవడో, నాయింట నాదుత్తలే
యవలీలంగని దించినార దెవరో యాయుట్టి పై నుండగా,
నెవడో మూతికి బూసె నా నిదురలో నీవెన్నలన్, జూచితే?
ఎవఁడో యెవ్వఁడొ యెవ్వఁడో యెవఁడొ తానెవ్వాఁడొకో యెవ్వఁడో!

Saturday 24 May 2014

తల భాష్పంబులు భీషణాస్త్ర చయమై దండించు దుర్మార్గులన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తల భాష్పంబులు భీషణాస్త్ర చయమై దండించు దుర్మార్గులన్.

మత్తేభము:
ఇల నేగాథను చూడలేదు వినలే దిబ్భంగి దుష్కృత్యమున్
బలిమిన్ జేసిరి నిర్భయంబున కడున్ బాధించిరా ' నిర్భయన్ '
తలలన్ దీయగ శిక్ష వేయవలయున్ తాత్సారమున్ జేయ కాం
తల భాష్పంబులు భీషణాస్త్ర చయమై దండించు దుర్మార్గులన్.

Wednesday 21 May 2014

ధునిఁ గొలిచినఁ దొలఁగు సకల దుఃఖచయంబుల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ధునిఁ గొలిచినఁ దొలఁగు సకల దుఃఖచయంబుల్.


కందము:
ధన కనక వస్తు వాహన
ఘన వైభవ మెంతొ గలుగు కైమోడ్పులతో
మనమునకు దొరకని యగా
ధునిఁ గొలిచినఁ దొలఁగు సకల దుఃఖచయంబుల్.

Tuesday 20 May 2014

రామ మనోరథమ్ము భళిరా నెరవేర్చెను కైక రాణియై

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రామ మనోరథమ్ము భళిరా నెరవేర్చెను కైక రాణియై


ఉత్పలమాల:
రాముడు భూమిపైన మరి రావణు జంపగ వచ్చె గాన తా
క్షేమము గానె రాజు యయి సీతను గూడి యయోధ్య నున్నచో
యేమగు రామ గాధ, సరి నెన్నగ తప్పది కాదు చూడగా
రామ మనోరథమ్ము భళిరా నెరవేర్చెను కైక రాణియై !

Monday 19 May 2014

కష్టహరుడు పంచాననుడు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - కష్టహరుడు పంచాననుడు. 














 













కందము:
శోకము దీర్చగ వచ్చెన
శోకవనమ్మునను తల్లి జూడగ, నేనే
మీ కష్ట ' హరుడ ' ననె నిజ
మీకపి ' పంచానన ' మని యెదురుగ నిలచెన్.

Sunday 18 May 2014

వేళ్ళు పైభాగమున నుండు వృక్షమునకు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వేళ్ళు పైభాగమున నుండు వృక్షమునకు.


తేటగీతి:
శాఖలందున జీవులు సరిగ బ్రతుకు
ప్రకృతి వృక్షమ్ము నేగూడి,  పైననుండి
మూల పురుషుడు పోషించు ముజ్జగముల
వేళ్ళు పైభాగమున నుండు వృక్షమునకు.

Saturday 17 May 2014

లేడీస్ ఫింగర్లు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - లేడీస్ ఫింగర్లు 

















 
ఆటవెలది: 
బెండ కాయ జూడ కండ బాగున్నది
తొడిమ ద్రుంచ బూన తునుగొ ? లేదొ ?
లేత గున్న నవియె ' లేడీసు ఫింగర్లు '
బాగ ముదుర పెద్ద ' బ్యాచిలర్లు '

Thursday 15 May 2014

పిట్టల జంట

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - పిట్టల జంట 






















కందము:
పిట్టల జంటను చూడుం
డెట్టులొ యా నీటిపైన నెగురుచు మొక్కల్
పట్టుకు నూగుచు నొడుపుగ
పట్టెను గా చేప నొకటి పలికెద 'వహ్వా'.

Wednesday 14 May 2014

ఓరుగల్లులోన నుండరాదు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఓరుగల్లులోన నుండరాదు.


ఆటవెలది:
కళలు కంబములను కనిపించుగా వేయి
హోరు మనును తెనుగు పౌరుషమ్ము
కనగ వినగ లేని కఠినాత్ములెవ్వరు
ఓరుగల్లులోన నుండరాదు.

Tuesday 13 May 2014

కాకతీయుల తో రణం...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం -  కాకతీయుల  తో రణం...



 















కందము:
కాకలు దీరిన యోధులు
కాకతి రాజుల బహుమతి కట్టడమిదియే
లోకమున నిలిచి యుండెను
శ్రీకరముగ నోరుగంట జేజేలనరే !

Monday 12 May 2014

హనుమత్పుత్రుడు వివాహమాడె హిడింబన్ .

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - హనుమత్పుత్రుడు వివాహమాడె హిడింబన్ .


కందము:
వినుమా ద్రౌపది ! యపుడా
వనములలో దిరుగు చుండ వలచిన కన్నెన్
కననసుర పుత్రి సుమదే
హను, మత్పుత్రుడు వివాహమాడె హిడింబన్ .

Sunday 11 May 2014

ఉ ( వి ) ద్యానవనము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - ఉ ( వి ) ద్యానవనము 



 














తేటగీతి:
అరయ పూదోట గ్రంథాలయమ్ము జూడ
వివిధ పొత్తంబులే యొప్పు విరులు గాను
చదువు వారలు గ్రోలుగా సార మందు
తేటి వోలెను, జ్ఞానులౌ మేటి గాను.

Saturday 10 May 2014

మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగ మయ్యెడిన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగ మయ్యెడిన్


ఉత్పలమాల:
సవ్వడి లేక జూచిరట 'శారద' నాట్యము పూర్తి గాగనే
సవ్వడి జేసి భేషులనె చప్పటులప్పుడు మారు మ్రోగగా
రివ్వున మానసంబెగసె రెక్కలు వచ్చెను సంతసంబుతో
మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగ మయ్యెడిన్

Friday 9 May 2014

బజ్జో బుజ్జీ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - బజ్జో బుజ్జీ



 



















కందము:
ఊయల లూగుము బుజ్జీ
బాయిని త్రాగితివి నీవు బజ్జో తండ్రీ
పోయిక రావలె నీటికి
మీయయ్యకు వండవలయు మీదట బువ్వన్. 

Tuesday 6 May 2014

సంతానము లేని వారలకె తప్పక కల్గును సద్గతుల్ సఖా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - సంతానము లేని వారలకె తప్పక కల్గును సద్గతుల్ సఖా

ఉత్పలమాల:
దానము ధర్మముల్ సలిపి తప్పక పుత్రుని కల్గ జేయగా
మానసమందు కోరుదురు, మందిని కొందర జూడగా నిలన్
మానము మంట గల్పి యవమానము నీయగ జూచు చెడ్డ సం
తానము లేని వారలకె తప్పక కల్గును సద్గతుల్ సఖా !

Monday 5 May 2014

నృసింహుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - నృసింహుడు


 
















కందము:
కంబము గొట్టగ కశిపుడు
అంబరమున నుండి యందె హరి నర హరిగా
సంబర మందగ బుట్టెను
సంబరమే బుట్టె నసుర చావు తెలివికిన్


Sunday 4 May 2014

శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యము గూర్చున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యము గూర్చున్



కందము:
భవరోగ బాధ దీర్పగ
భువిలో ఘన వైద్యు లెవరు పుట్టగ లేరే
స్తవనీయులైన శివకే
శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యము గూర్చున్

Saturday 3 May 2014

అరణ్య ' మార్గము '

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - అరణ్య ' మార్గము '


 















 
తేటగీతి: 
అడవులన్నిటి నరుడేమొ హతము జేయ
మోదమే లేక నారణ్య రోదనాయె
నడవి వీడెను సింగంబు లడలి పోయి
మార్గమేలేక జనుచుండె మార్గ మందు

Friday 2 May 2014

పోరు సేయలేఁడు పోటుకాఁడు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పోరు సేయలేఁడు పోటుకాఁడు.


ఆటవెలది:
భీరు లైన వారు పోరు సేయగ పోరు
కోరి దెచ్చు కొనరు పోరు చూడ
ధర్మ యుద్ధ మందు తప్పు విధానపు
పోరు సేయలేఁడు పోటుకాఁడు.

Thursday 1 May 2014

ఉండ్రాళ్ళయ్యా... గుంజీళ్ళయ్యా...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - ఉండ్రాళ్ళయ్యా... గుంజీళ్ళయ్యా...


 

















తేటగీతి:
బొజ్జ గణపయ్య మాకైన యొజ్జ వీవు
విద్య లొసగుము దానితో వినయమిమ్ము
తీతు గుంజీలు నీ ముందు ప్రీతి తోడ
పెడుదునుండ్రాళ్ళు కుడుములు విఘ్నరాజ.