తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday, 10 May 2014

మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగ మయ్యెడిన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగ మయ్యెడిన్


ఉత్పలమాల:
సవ్వడి లేక జూచిరట 'శారద' నాట్యము పూర్తి గాగనే
సవ్వడి జేసి భేషులనె చప్పటులప్పుడు మారు మ్రోగగా
రివ్వున మానసంబెగసె రెక్కలు వచ్చెను సంతసంబుతో
మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగ మయ్యెడిన్

No comments: