తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday, 19 September 2013

కబడ్డీ లో ' గీత '

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - కబడ్డీ లో ' గీత '
 ఆటవెలది:
గీత లోనె గలదు గెలుపోటముల తీర్పు
'గీత' నెరిగి బ్రతుక గెలుపు మనదె
వెనుక శక్తు లెన్ని వేధించి లాగిన
గీత దాక చాపు చేతులనిక.

('గీత' దలచి చూపు చేతలనిక.)

1 comment:

Sharma said...

గీతే హద్దు గల ఆట కబడ్డీ . ఇందులో కూడా ఆ గీతని చూపించటం ఎంతో చక్కగా వుంది .