మీకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు
శ్రీ దుర్గాయైనమః
కందము:
భర్గుని దేవీ ! మాతా !
దుర్గా ! నిన్ మదిని వేడి దోయిలినిడ స
న్మార్గము జూపింతువు, దు
ర్మార్గము మాదరికి రాగ మసియగు గాదా !
కందము:
అ మ్మలకే ప్రియ సుతవే !
అమ్మలకే యమ్మవీవు యపరాజితవే !
అమ్మహిషు పాలి కాళీ !
అమ్మహిమను మహినిజూప నఘములు ఖాళీ !
No comments:
Post a Comment