శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - మం " గళం " పల్లి
సీసము:
పంచరత్నములను పరవశమ్మున బాడి
త్యాగరాజును మన తలపు నింపు
రాముని కీర్తనల్ రమ్యంబుగా పాడి
అలనాటి గోపన్న యార్తి పంచు
తిల్లాన జల్లులే తీపిగా కురిపించి
ప్రేక్షకజనముల ప్రీతి ముంచు
కర్ణాట సంగీత గానమ్ము తలపగా
తనదు రూపమెమన తలను నిల్చు
తేటగీతి:
పేరునందునబాలుండె పెద్ద పేరు
వాద్యమున్నది పేరులో వాక్కు తీపి
గీతజెప్పిన వాడె సంగీతమందు
మంగళంబగు నాగళ మహిమనెన్న.
No comments:
Post a Comment