శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
`
వర్ణ (న) చిత్రం - శారీ మందిర్

కందము:
శారీలను చూడుడు ప్రతి
సారీ కొంగ్రొత్త సరుకు సందడి చేయున్
సారించుడు చూపుల, వే
సారీ విసుగింత మాకు చచ్చిన రాదే !
తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------