తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday 13 March 2016

స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  13 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై




కందము: 
పూలతల వంటి వనితలు
కేలెత్తియు వేసినారు కేకలు సభలో
ఏలాగు మనువ ? ఎందుకు
" స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై ? "  


కందము: 
గోలనువిని మనువరచెను
శ్రీలను పూయించు మీకు చెడు తొలగుటకై
ఓలలన లార జెప్పితి
" స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై " 


కందము: 
నేల పునాదుల నుండియు 
నేలాగున నిల్లు గట్ట నేర్చినవారిన్ 
మేలుగ నుంచుము, చిరు మే 
స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై.   

No comments: