తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday, 31 January 2016

వెండి చందమామ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  04 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - వెండి చందమామ 






















తేటగీతి: 
చంద మామయె పుట్టెను సంద్రమందు 
వెండి రూపున రూపమ్ము వెలుగు చుండ 
నింగి సాగుచు పోనుండ, నీలి కడలి 
సంతసమ్మున నవ్వుఛు సాగనంపె. 

Saturday, 30 January 2016

కరి నెత్తుకుపోయి యెలుక కలుగునఁ దినియెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  03 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కరి నెత్తుకుపోయి యెలుక కలుగునఁ దినియెన్



కందము: 
" బెరిజిలకరి ' యను పేరున 
సరిక్రొత్తగ వంటకమ్ము సతియే జేసెన్ 
మరి పతియె త్రోయ ' బెరిజిల 
కరి ' నెత్తుకుపోయి యెలుక కలుగునఁ దినియెన్

Friday, 29 January 2016

రావణుజేరె సీత యనురాగము లొల్కెడు పల్కు లాడుచున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  02 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - రావణుజేరె సీత యనురాగము లొల్కెడు పల్కు లాడుచున్



ఉత్పలమాల: 
కావరమెక్కి మోసమున గట్టుక తాపసి వేషమప్పుడే 
తా వరగర్వ చిత్తమున తద్ధర పుత్రిని లంకజేర్చగా 
నావల రామచంద్రు డనినద్భుత రీతిని గూల్చివేయగా
రావణు, జేరె సీత యనురాగము లొల్కెడు పల్కు లాడుచున్. 

Thursday, 28 January 2016

పల్లె పడుచు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  02 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చితం - పల్లె పడుచు 



















కందము: 
బరువెక్కి పంట, పొలమున 
నొరుగుచు తానుండె నటుల నొక్కటి మోపున్ 
శిరమున దాల్చుక పడతియె 
మరి కనులకు పంటగానె మసలుచునొరిగెన్.  

Wednesday, 27 January 2016

అభి 'నవ ' శ్రవణ కుమార్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  01 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




వర్ణ (న) చిత్రం - అభి 'నవ ' శ్రవణ కుమార్ 























కందము: 
శ్రవణకుమారుండు మరల 
భువిలోనే పుట్టినాడు పుణ్యాత్ముడురా 
స్తవనీయుడె మరి వా
స్తవమేనాయంద్రు నేటి వసుధను ప్రజలే .

Tuesday, 26 January 2016

జనగణ మనోధి నాయక

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు


కందము: 
"జనగణ మనోధి నాయక " 
ఘనముగనని బాడుడెగుర గణతంత్ర మహా 
దినమున మనజెండాయే 
వినువీధుల విశ్వశాంతి వెలుగుల నింపన్.

Monday, 25 January 2016

అరటిపండు మూల్య మాఱుకోట్లు.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  01 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - అరటిపండు మూల్య మాఱుకోట్లు.


ఆటవెలది:
కొండవీటి రాజు కొడుకాడుకున్నట్టి
పసిడి బొమ్మలన్ని పలికె వేల
మందు గుఱ్ఱమేన్గు, హంస, మామిడిపండు
అరటిపండు మూల్య మాఱుకోట్లు.

Sunday, 24 January 2016

' మునుగు ' కాయలు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  31 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - ' మునుగు ' కాయలు




















కందము: 
మునుగును పులుసున కావున
ననుచుంటిమి మునగకాయలనుచును నివియే
మునుగుచు తేలుచు లేకను
ననగలమే పప్పుచారు నాహా యనుచున్ ! 


కందము: 
ఏ విటమిను గలిగుండును 
చేవగ నున్నట్టి మునగ చేయును చలువన్ 
కావంట పనికిరానివి 
యావంటకు పూత మరియు నాకులు, తినుమా ! 

Saturday, 23 January 2016

పెరుగన్నం

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  30 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




వర్ణ (న) చిత్రం - పెరుగన్నం 



















కందము: 
పెరుగన్నము తిన్నావా 
పెరుగును చలువే యొడలున, పిసరంతైనన్ 
మరి నిమ్మ యూరగాయను 
మరువక నూనంజుకున్న మజ్జారే ! వాహ్ !

Friday, 22 January 2016

నాలుగు " కాఫీ " ల పద్యం


నాలుగు " కాఫీ " ల పద్యం 


కందము: 
కాఫీ త్రాగుటకెందుల 
కా ఫీలింగ్, త్రాగు రెండు కప్పులు, నీకే
" కాఫీ " దేతా హూ  నీ
కా ఫీడింగ్ చాలకున్న,  క్యా ! బోలో జీ ! 

" కాఫీ " అంటే "వలసినంత " అని అర్థం....

వింటి జూడగ మింటిని

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  29 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - వింటి జూడగ మింటిని




















తేటగీతి: 
వింటి జూడగ మింటిని వింటి ముదము 
పట్టలేములె, యిల్లెక్కి పట్టలేము 
మనము రంగులతోనిండు మనము గనగ
నింద్ర జాలము గాదిది యింద్ర ధనువు.

Thursday, 21 January 2016

కుపతిని గనిమెచ్చె సాధ్వి కోర్కులు మించన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - కుపతిని గనిమెచ్చె సాధ్వి కోర్కులు మించన్. 




కందము: 
విపరీతపు ధరయైనను 
నెపమెంచక నడుగగానె, నెక్లెస్ తానే
యపుడే తేగానే తన 
కు, పతిని గనిమెచ్చె సాధ్వి కోర్కులు మించన్. 

Tuesday, 19 January 2016

వారకాంత మీది వలపుమేలు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - వారకాంత మీది వలపుమేలు



ఆటవెలది: 
పుట్టినిల్లు వదలి పొలతియె తన భర్త
కన్నబిడ్డల సరి గనుచునుండు
పురుష పుంగవ !విను పుణ్య మిదియె తని
వార, కాంతమీది వలపుమేలు

Monday, 18 January 2016

చవట కదా నిన్నుఁ దలప శంకరపత్నీ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - చవట కదా నిన్నుఁ దలప శంకరపత్నీ



కందము: 
శివమును గోరుచు నిన్నే 
యవనిని తగు భక్తి తోడ నారాధింపన్ 
భవరోగముమాపై నుం 
చవట కదా నిన్నుఁ దలప శంకరపత్నీ!

Sunday, 17 January 2016

సుమముగ నుమ మారిపోయి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - సుమముగ నుమ మారిపోయి 























కందము: 
హిమవంతుని పుత్రికయే
సుమములనే సజ్జనింపి సాగుచు నుండెన్
డమరుక ధారుని పూజకు
సుమముగ నుమ మారిపోయి శోభిలుచుండెన్.

Saturday, 16 January 2016

తార తనయుడై పుట్టె సుధాకరుండు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  23 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - తార తనయుడై పుట్టె సుధాకరుండు




తేటగీతి: 
క్షీర సాగర మథనాన సిరియె బుట్టె 
కల్ప వృక్షమ్ము, యేనుగు కామధేను 
వివియె గాకను మరియొక్క టేది చెప్పు 
తార ? " తనయుడై పుట్టె సుధా కరుండు ". 

Friday, 15 January 2016

ముంచెత్త శోభ



అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. 





















సీసము: 
హరిహరియనుచును హరిదాసు మేల్కొల్ప 
చెత్తగాలుచుమ ముంచెత్త శోభ
రథము మ్రుగ్గిడి మనోరథము దీరుచుకొమ్ము 
ఇళ్ళముంగిటను గొబ్బిళ్ళ బెట్టి 
పొంగమది తినుమ పొంగలీ పులగమ్ము   
లరిసెగారెల రుచులరసి నీవు 
బాలల తల దలంబ్రాలుగా పోయుము 
రేగుపండ్ల మిగుల రేగ కాంతి 

ఆటవెలది: 
గంగిరెద్దులాట ముంగిటనే జూచి  
గాలికెగురవేసి గాలిపటము 
భోగి సంకురాత్రి భోగముల్ గనుమింక
తెనుగు నాట పరుల మనసు నాట.    

Thursday, 14 January 2016

పలకను

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  23 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




వర్ణ (న) చిత్రం - పలకను




















కందము: 
అమ్మా ! యీ పలకను, వల
దమ్మా మరి యక్షరమ్ము లన్నీ యిపుడే ! 
అమ్మాయీ ! పలకను మరి 
మ్మాయని వెనుకజేరి యల్లరి జేయన్.

Wednesday, 13 January 2016

కావు కావు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




వర్ణ (న) చిత్రం - కావు కావు 




















ఆటవెలది: 
కాకి గోల వినగ కాఠిన్యమనుటేల
కారు నలుపటంచు కసరుటేల 
పితర కర్మలందు పిలుతువు నన్నేల
పిండమింత బెట్టి పిదప కినుక.


ఆటవెలది: 
కావు కావు మనుచు దేవుని దలచేము
మనిషి తిట్టు నుండి మమ్ము గావ
కావలేదు, లేద కరుణయె యిసుమంత
కావు మనిషివీవు కావు కావు.

Tuesday, 12 January 2016

వేయి కనులవాఁడు వినత కొడుకు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  20 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - వేయి కనులవాఁడు వినత కొడుకు.




ఆటవెలది: 
వేయి తలలు కనులు వేయిపాదంబులు 
వేయి పేర్ల వాని వీపు మోయు 
భక్తులార గనుడు పరవశంబును బొంది 
వేయికనుల, వాఁడు వినత కొడుకు.

Monday, 11 January 2016

లక్ష్మణ రేఖలు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - లక్ష్మణ రేఖలు. 


















కందము: 
రేఖలు గీసెను మరదియె
తా ఖాతరు జేయకుండ దాటెను, మాయల్ 
రేఖామాత్రము తెలియక 
నా ఖలు చేతను బడెగద హా! యవనిజయే!

Sunday, 10 January 2016

కాఫీ

 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




వర్ణ (న) చిత్రం - కాఫీ 

























కందము: 
మరిగిన నీటను పొడితో 
మరిజేర్చుచు  శర్కర, తగు మాత్రము పాలన్ 
నురగలు గ్రక్కెడు కాఫీ 
మరిగిన వాడె ట్లు మారు, మరిమరి త్రాగున్.


కందము
కాఫీ త్రాగినగానీ 
'సాఫీ' గా పనులుగావు సరి యుదయమునన్ 
మాఫీ యగు తలనొప్పులు 
కాఫీనే యతిథి కిడక కదలడు గనుమా !

Saturday, 9 January 2016

పుట్టిన వాఁడెవఁడు గిట్టఁ బోఁడీ ధరపై .

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  16 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పుట్టిన వాఁడెవఁడు గిట్టఁ బోఁడీ ధరపై .



కందము: 
పుట్టెడు బాధలువొందెడు 
మట్టిన నివసింఛు బీద మానవులను తా 
గట్టిగ దరిజేర్చుటకై 
పుట్టిన వాఁడెవఁడు గిట్టఁ బోఁడీ ధరపై .

Friday, 8 January 2016

భూమి పెంచిన భారతం

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  16 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - భూమి  పెంచిన భారతం 





















కందము: 
ఏమాస్టరు హోం వర్కును 
భూమాతకునిచ్చె భరత భూమిని గీయన్ 
ఏమిది చిత్రమె చూడగ 
నీమానున నిలిపె దేశ చిత్రము వోలెన్.

Thursday, 7 January 2016

హరిని హరియింప వరియించె హరిని హరిణ


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  15 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - హరిని హరియింప వరియించె హరిని హరిణ




తేటగీతి: 
ఇంద్రుడందురు, సూర్యుండు, చంద్రుడంద్రు 
గాలి, కిరణమ్ము, హరియన్న కప్ప, పాము 
హరిణ మనజింక, తెలు, పెట్లు హరి! హరి! హరి! 
హరిని హరియింప వరియించె హరిని హరిణ ?

Wednesday, 6 January 2016

దశరథుని శబ్దభేది మోదమ్ముఁ గూర్చె.






శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  14 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - దశరథుని శబ్దభేది మోదమ్ముఁ గూర్చె.




తేటగీతి: 
భావి జరిగెడి కథకేమొ పడెపునాది
శ్రవణు తలిదండ్రు లొసగగ శాపమపుడు 
దనుజ నాశమ్ము గోరెడి దైవమునకు
దశరథుని శబ్దభేది మోదమ్ముఁ గూర్చె.

Tuesday, 5 January 2016

నలదమయంతి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  14 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.





వర్ణ (న) చిత్రం - నలదమయంతి


























నలుని మనోగతం...

రయ తనపుట్టినింటికి నలిగి పోదు 
నలుడ నాతోడనున్నచో నలిగిపోవు 
కాన విడుతును కానను, కానరాక 
త్రోవ తలిదండ్రి కడకేగు తొయ్యలికను. 

Monday, 4 January 2016

పూవులో రెండు పూవులు పూచెఁ గనుడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  13 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పూవులో రెండు పూవులు పూచెఁ గనుడు



తేటగీతి: 
సూర్యు డొక్కటి పుష్పమ్ము చూడగాను 
చంద్రుడింకొక సుమమేను చక్కగాను 
కన్నులాయమ్మ లలితకు కమల ముఖికి  
పూవులో రెండు పూవులు పూచెఁ గనుడు !

Sunday, 3 January 2016

చీరెల దొంగ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  13 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




వర్ణ (న) చిత్రం - చీరెల దొంగ




















కందము: 
చీరెల దొంగే కాదట
చేరిన తనవారి కున్న చీకాకులనే
చీరును చేడియలారా !
చోరుని కోరిన వలువలు చొప్పడు విలువల్.

Saturday, 2 January 2016

వ్యాస గురుదేవులు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  12 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - వ్యాస గురుదేవులు. 






















కందము: 
దండము వ్యాసునకును మరి 
దండము శ్రీ శంకరునకు ధర జ్ఞానమునే 
దండిగ వెలిగించగ మన 
కుండిన ఘన గురులకు నొనగూర్తును నతులన్.

Friday, 1 January 2016

అందరికీ  2016 " ఆంగ్ల " సంవత్సర శుభాకాంక్షలు...


కందము:  
పదియారు రెండువేలకు 
పదిలముగా కలసినట్టి వత్సరమందున్  
వదలక మిము సుఖశాంతులు 
మదిగది నానంద జ్యోతి మరినిండవలెన్.