శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - కావు కావు
ఆటవెలది:
కాకి గోల వినగ కాఠిన్యమనుటేల
కారు నలుపటంచు కసరుటేల
పితర కర్మలందు పిలుతువు నన్నేల
పిండమింత బెట్టి పిదప కినుక.
ఆటవెలది:
కావు కావు మనుచు దేవుని దలచేము
మనిషి తిట్టు నుండి మమ్ము గావ
కావలేదు, లేద కరుణయె యిసుమంత
కావు మనిషివీవు కావు కావు.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - కావు కావు
ఆటవెలది:
కాకి గోల వినగ కాఠిన్యమనుటేల
కారు నలుపటంచు కసరుటేల
పితర కర్మలందు పిలుతువు నన్నేల
పిండమింత బెట్టి పిదప కినుక.
ఆటవెలది:
కావు కావు మనుచు దేవుని దలచేము
మనిషి తిట్టు నుండి మమ్ము గావ
కావలేదు, లేద కరుణయె యిసుమంత
కావు మనిషివీవు కావు కావు.
No comments:
Post a Comment