శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - నలదమయంతి
నలుని మనోగతం...
అరయ తనపుట్టినింటికి నలిగి పోదు
నలుడ నాతోడనున్నచో నలిగిపోవు
కాన విడుతును కానను, కానరాక
త్రోవ తలిదండ్రి కడకేగు తొయ్యలికను.
No comments:
Post a Comment