తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
Monday, 29 July 2013
Sunday, 28 July 2013
కల్ల లాడు వారు కవులు సుమ్ము.
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కల్ల లాడు వారు కవులు సుమ్ము.
ఆటవెలది:
సరస గతుల దున్ని సాహిత్య సేద్యమ్ము
సలిపి కావ్య ఫలము సజ్జనాళి
చేతి కందజేసి జేజేలు పొందుట
కల్ల లాడు వారు కవులు సుమ్ము.
సమస్యకు నా పూరణ.
సమస్య - కల్ల లాడు వారు కవులు సుమ్ము.
ఆటవెలది:
సరస గతుల దున్ని సాహిత్య సేద్యమ్ము
సలిపి కావ్య ఫలము సజ్జనాళి
చేతి కందజేసి జేజేలు పొందుట
కల్ల లాడు వారు కవులు సుమ్ము.
Friday, 26 July 2013
ఆలినిఁ ద్యజియించెడి పతి హాయిగ నుండున్.
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - ఆలినిఁ ద్యజియించెడి పతి హాయిగ నుండున్.
కందము:
ఆలును బిడ్డల గూడుచు
మేలుగ సంసార మింక మేదిని జేయన్
చాలని, చాలని యా వెల
యాలినిఁ ద్యజియించెడి పతి హాయిగ నుండున్.
సమస్యకు నా పూరణ.
సమస్య - ఆలినిఁ ద్యజియించెడి పతి హాయిగ నుండున్.
కందము:
ఆలును బిడ్డల గూడుచు
మేలుగ సంసార మింక మేదిని జేయన్
చాలని, చాలని యా వెల
యాలినిఁ ద్యజియించెడి పతి హాయిగ నుండున్.
Thursday, 25 July 2013
Wednesday, 24 July 2013
దశరథుఁడే వనులకేగెఁ దపసులు మెచ్చన్.
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - దశరథుఁడే వనులకేగెఁ దపసులు మెచ్చన్.
కందం:
దశదిశల ఖ్యాతిగాంచిన
యశమును గన్నట్టి పుత్రు డారఘు రామున్
కుశలము నెంచక గోరగ
దశరథుఁడే, వనులకేగెఁ దపసులు మెచ్చన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - దశరథుఁడే వనులకేగెఁ దపసులు మెచ్చన్.
కందం:
దశదిశల ఖ్యాతిగాంచిన
యశమును గన్నట్టి పుత్రు డారఘు రామున్
కుశలము నెంచక గోరగ
దశరథుఁడే, వనులకేగెఁ దపసులు మెచ్చన్.
Tuesday, 23 July 2013
మద్యనిషేధచట్టమును మానిను లెల్లఁ దిరస్కరించిరే
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - మద్యనిషేధచట్టమును మానిను లెల్లఁ దిరస్కరించిరే
ఉత్పలమాల :
పద్యము జెప్పుచుంటినిక వ్రాయుము పుత్రుడ!చెప్పు నాన్న! వ్రాయ్!
"మద్యనిషేధచట్టమును మానిను లెల్లఁ దిరస్కరించిరే!"
పద్యము నొక్క పాద మిట వ్రాసితి! చెప్పెద నాలకింపుమా!
"మద్య 'నిషా' ద చట్టమును మానిను లెల్లఁ దిరస్కరించిరే!"

Monday, 22 July 2013
బిడ్డడా వాడు? రణరంగ భీకరుండు.
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - బిడ్డడా వాడు? రణరంగ భీకరుండు.
తేటగీతి:
స్కందు శౌర్యము జూడుమా యిందు వదన
శూలి శక్తిని మించిన జోదు, కనగ
తారకాసురు జంపును తాట దీయు
బిడ్డడా వాడు? రణరంగ భీకరుండు.
సమస్యకు నా పూరణ.
సమస్య - బిడ్డడా వాడు? రణరంగ భీకరుండు.
తేటగీతి:
స్కందు శౌర్యము జూడుమా యిందు వదన
శూలి శక్తిని మించిన జోదు, కనగ
తారకాసురు జంపును తాట దీయు
బిడ్డడా వాడు? రణరంగ భీకరుండు.
Sunday, 21 July 2013
జాలమే యవరోధమ్ము సాధకులకు
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - జాలమే యవరోధమ్ము సాధకులకు.
తేటగీతి:
నేర్పు విషయము లీ ' నెట్టు ' నేర్పుగాను
చాల యువతకు ' కెరియరు ' సాధనమున
చిట్టి నెట్టిది 'మిస్యూజు ' సేయ నిట్టి
'జాలమే' యవరోధమ్ము సాధకులకు.
సమస్యకు నా పూరణ.
సమస్య - జాలమే యవరోధమ్ము సాధకులకు.
తేటగీతి:
నేర్పు విషయము లీ ' నెట్టు ' నేర్పుగాను
చాల యువతకు ' కెరియరు ' సాధనమున
చిట్టి నెట్టిది 'మిస్యూజు ' సేయ నిట్టి
'జాలమే' యవరోధమ్ము సాధకులకు.
Saturday, 20 July 2013
తమ్ము గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు.
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - తమ్ము గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు.
తేటగీతి:
బ్రహ్మ కడిగిన పాదమ్ము బలిని త్రొక్కి
యణచి వేసిన పాదమ్ము హనుమ భక్తి
పట్టి వదలని పాదమ్ము గట్టిగ సత
తమ్ము గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు.
సమస్యకు నా పూరణ.
సమస్య - తమ్ము గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు.
తేటగీతి:
బ్రహ్మ కడిగిన పాదమ్ము బలిని త్రొక్కి
యణచి వేసిన పాదమ్ము హనుమ భక్తి
పట్టి వదలని పాదమ్ము గట్టిగ సత
తమ్ము గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు.
Friday, 19 July 2013
పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్.
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్.
కందము:
పాలను బోయగ పుట్టను
మాలతి తో బోవు చుంటి మనవాడికిదో
పాలను హార్లిక్స్ కలుపుచు
పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్.
కందము:
పాలను బోయగ పుట్టను
మాలతి తో బోవు చుంటి మనవాడికిదో
పాలను హార్లిక్స్ కలుపుచు
పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్.
Thursday, 18 July 2013
గడ్డము గీచుకొమ్మనుచు కాంతుడు భార్యకు జెప్పె ప్రీతితో.
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - గడ్డము గీచుకొమ్మనుచు కాంతుడు భార్యకు జెప్పె ప్రీతితో.
కుటుంబ పోషణకై కుల వృత్తియగు క్షురకర్మను చేపట్టిన ఒక ' కొమ్మ ' (వనిత) గురించి టీవీలో కొంత కాలం క్రితం చూచాను.
ఉత్పలమాల:
గడ్డము సేయువారు కనగా మగవారని యెంచ బోకుమీ
గడ్డను బుట్టి బిడ్డలను గావగ జానెడు పొట్ట కోసమై
అడ్డము గాదు స్త్రీత్వమని యమ్మడు వృత్తిని బట్టె నీమెయే
గడ్డము గీచు ' కొమ్మ ' నుచు కాంతుడు భార్యకు జెప్పె ప్రీతితో.

Wednesday, 17 July 2013
వికలాంగుఁడు రథము నడిపె వినువీథిపయిన్.
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య- వికలాంగుఁడు రథము నడిపె వినువీథిపయిన్.
కందము:
అకటా వినతా సుతునకు
నిక కాళ్ళే లేవు వాని నిన సారథిగా
ప్రకటింపగ సంతసమున
వికలాంగుఁడు రథము నడిపె వినువీథిపయిన్.
సమస్యకు నా పూరణ.
సమస్య- వికలాంగుఁడు రథము నడిపె వినువీథిపయిన్.
కందము:
అకటా వినతా సుతునకు
నిక కాళ్ళే లేవు వాని నిన సారథిగా
ప్రకటింపగ సంతసమున
వికలాంగుఁడు రథము నడిపె వినువీథిపయిన్.
Tuesday, 16 July 2013
Monday, 15 July 2013
వార్ధిలో మున్గె భానుఁడు పగటివేళ.
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - వార్ధిలో మున్గె భానుఁడు పగటివేళ.
తేటగీతి:
చిట్టి కుంతిని చేపట్టి పట్టినీయ
పట్ట లేకను తా పెట్టి పెట్టె లోన
వదల నీటను వదలక కదలి శోక
వార్ధిలో మున్గె భానుఁడు పగటివేళ.
సమస్యకు నా పూరణ.
సమస్య - వార్ధిలో మున్గె భానుఁడు పగటివేళ.
తేటగీతి:
చిట్టి కుంతిని చేపట్టి పట్టినీయ
పట్ట లేకను తా పెట్టి పెట్టె లోన
వదల నీటను వదలక కదలి శోక
వార్ధిలో మున్గె భానుఁడు పగటివేళ.
Sunday, 14 July 2013
కాకినిఁ జంపి కౌరవులు గర్జన సేసిరి సంతసమ్మునన్.
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కాకినిఁ జంపి కౌరవులు గర్జన సేసిరి సంతసమ్మునన్.
ఉత్పలమాల:
లోకము నింద వేసినను లోపము లేదని దుష్ట బుద్ధితో
మేకను బట్టి క్రూరముగ మేసెడు నక్కల గుంపు కైవడిన్
మైకము క్రమ్మ గొట్టి రభిమన్యుని వ్యూహమునందు చూడ నే
కాకినిఁ జంపి కౌరవులు గర్జన సేసిరి సంతసమ్మునన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - కాకినిఁ జంపి కౌరవులు గర్జన సేసిరి సంతసమ్మునన్.
ఉత్పలమాల:
లోకము నింద వేసినను లోపము లేదని దుష్ట బుద్ధితో
మేకను బట్టి క్రూరముగ మేసెడు నక్కల గుంపు కైవడిన్
మైకము క్రమ్మ గొట్టి రభిమన్యుని వ్యూహమునందు చూడ నే
కాకినిఁ జంపి కౌరవులు గర్జన సేసిరి సంతసమ్మునన్.
Saturday, 13 July 2013
పతిపైనన్ బరమసాధ్వి పాదము మోపెన్.
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - పతిపైనన్ బరమసాధ్వి పాదము మోపెన్.
కందము:
పతియే మహిషాసురుడయె
సతియా రాక్షసుని జంపు ' సతి ' వలె మారెన్
స్తుతమైన నాటకమ్మున
పతిపైనన్ బరమసాధ్వి పాదము మోపెన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - పతిపైనన్ బరమసాధ్వి పాదము మోపెన్.
కందము:
పతియే మహిషాసురుడయె
సతియా రాక్షసుని జంపు ' సతి ' వలె మారెన్
స్తుతమైన నాటకమ్మున
పతిపైనన్ బరమసాధ్వి పాదము మోపెన్.
Friday, 12 July 2013
ఎండను నిద్రించ సుఖము నిచ్చును మిగులన్
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - ఎండను నిద్రించ సుఖము నిచ్చును మిగులన్
కందము:
బండెడు బట్టల నుతికితి
మెండుగ నీరసము వచ్చె, మీనా! సీతా!
రండిటు బట్టల వేయుద
మెండను, నిద్రించ సుఖము నిచ్చును మిగులన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - ఎండను నిద్రించ సుఖము నిచ్చును మిగులన్
కందము:
బండెడు బట్టల నుతికితి
మెండుగ నీరసము వచ్చె, మీనా! సీతా!
రండిటు బట్టల వేయుద
మెండను, నిద్రించ సుఖము నిచ్చును మిగులన్.
Thursday, 11 July 2013
కారము లేకున్న కావు కార్యములెందున్.
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కారము లేకున్న కావు కార్యములెందున్.
కందము:
కారము వలె కూరకు, సహ
కారము వలె దంపతులకు కాపురమున, శ్రీ
కారము వలె కావ్యమునకు
'కారము' లేకున్న కావు కార్యములెందున్.
సమస్యకు నా పూరణ.
సమస్య - కారము లేకున్న కావు కార్యములెందున్.
కందము:
కారము వలె కూరకు, సహ
కారము వలె దంపతులకు కాపురమున, శ్రీ
కారము వలె కావ్యమునకు
'కారము' లేకున్న కావు కార్యములెందున్.
Wednesday, 10 July 2013
రావణాగమనముఁ గోరె రమణి సీత.
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - రావణాగమనముఁ గోరె రమణి సీత.
పాఠశాల వార్షికోత్సవమున తమ కుమారుడు వేయు రావణాసుర పాత్రను చూడాలని వెళ్ళిన తల్లి ఆతృత....
కందము:
రావణాసుర వేషము రాము డాడ
బడికి జేరెను తండ్రియు భార్య తోడ
కొడుకు వేసెడి పాత్రను కోరి చూడ

Tuesday, 9 July 2013
సురభికి జన్మించె ఖరము చోద్య మెటులగున్
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - సురభికి జన్మించె ఖరము చోద్య మెటులగున్
సూరయ్య అను వాడు తాను పెంచే గాడిద జంటకు సురభి, సూరి అని పేర్లు పెట్టుకున్నాడు...
కందము:
సురభీ, సూరీ ఖరములు
సూరయ్యే పెంచినాడు చూడగ నొకటై
మరియొక్క నాడు 'కనగా'
'సురభికి' జన్మించె ఖరము చోద్య మెటులగున్?

Monday, 8 July 2013
తనయను సేవింప నొదవుఁ దద్దయు సుఖముల్.
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - తనయను సేవింప నొదవుఁ దద్దయు సుఖముల్.
కందము:
కనకపు ధారా స్తవమును
వినయముతోడను పఠించి వివిధ సుమాలన్
అనవరతము క్షీరాంబుధి
తనయను సేవింప నొదవుఁ దద్దయు సుఖముల్.
సమస్యకు నా పూరణ.
సమస్య - తనయను సేవింప నొదవుఁ దద్దయు సుఖముల్.
కందము:
కనకపు ధారా స్తవమును
వినయముతోడను పఠించి వివిధ సుమాలన్
అనవరతము క్షీరాంబుధి
తనయను సేవింప నొదవుఁ దద్దయు సుఖముల్.
Sunday, 7 July 2013
రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్.
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్.
కందము:
వేలూ లక్షలు జనమే
గోలలు లేకుండ ' మక్క' కూడలి "అల్లా
మేలిమ్మని" సైతాన్ పై
రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్.
సమస్యకు నా పూరణ.
సమస్య - రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్.
కందము:
వేలూ లక్షలు జనమే
గోలలు లేకుండ ' మక్క' కూడలి "అల్లా
మేలిమ్మని" సైతాన్ పై
రాలను రువ్వు జనులకు వరాల నొసంగున్.
Saturday, 6 July 2013
నరులే కారణము లంక నాశన మునకున్.
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - నరులే కారణము లంక నాశన మునకున్.
కందము:
నరుడై పుట్టెను హరి వా
నరులుగ పుట్టెన్ సురలును నానా విధమౌ
హరి హర శక్తుల నరవా
నరులే కారణము లంక నాశన మునకున్.
సమస్యకు నా పూరణ.
సమస్య - నరులే కారణము లంక నాశన మునకున్.
కందము:
నరుడై పుట్టెను హరి వా
నరులుగ పుట్టెన్ సురలును నానా విధమౌ
హరి హర శక్తుల నరవా
నరులే కారణము లంక నాశన మునకున్.
Friday, 5 July 2013
డండడ డడ డండ డండ డండడ డండమ్.
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - డండడ డడ డండ డండ డండడ డండమ్.
కందము:
దండమయా నా వోటరు!
దండలనే నీకు వేతు దయ జూపయ్యా!
దండిగ డప్పును గొట్టెద
డండడ డడ డండ డండ డండడ డండమ్.
సమస్యకు నా పూరణ.
సమస్య - డండడ డడ డండ డండ డండడ డండమ్.
కందము:
దండమయా నా వోటరు!
దండలనే నీకు వేతు దయ జూపయ్యా!
దండిగ డప్పును గొట్టెద
డండడ డడ డండ డండ డండడ డండమ్.
Wednesday, 3 July 2013
ఫాలలోచనుండు పాపి సుమ్ము.
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - ఫాలలోచనుండు పాపి సుమ్ము.
ఆటవెలది:
పార్వతి యన పిచ్చి పరగ మేన్సగమిచ్చె
పాపరేళ్ళ పిచ్చి పైన దాల్చె
'పా' ను ' పీ' ను గలిపి పరమేశు దలచగ
ఫాలలోచనుండు పాపి సుమ్ము.
సమస్యకు నా పూరణ.
సమస్య - ఫాలలోచనుండు పాపి సుమ్ము.
ఆటవెలది:
పార్వతి యన పిచ్చి పరగ మేన్సగమిచ్చె
పాపరేళ్ళ పిచ్చి పైన దాల్చె
'పా' ను ' పీ' ను గలిపి పరమేశు దలచగ
ఫాలలోచనుండు పాపి సుమ్ము.
Tuesday, 2 July 2013
అఱవమునందు వేమన మహాకవి భాగవతమ్ముఁ జెప్పెఁగా!
శ్శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - అఱవమునందు వేమన మహాకవి భాగవతమ్ముఁ జెప్పెఁగా!
చంపకమాల:
అఱవక చెప్పు మెందు విన ' నప్ప ' గ బిల్తురు తండ్రి ? నెవ్వరే
వెఱవక మేడిపండు వలె వెల్గెడు సంఘము గుట్టు విప్పె? తా
కఱవదిదీర పోతనయె స్కంధములందున నేమి జెప్పెనో
అఱవమునందు - వేమన మహాకవి - భాగవతమ్ముఁ జెప్పెఁగా!

Monday, 1 July 2013
తినుచో తియ్యని వేపగింజ మదిలో దీపించు సద్యోగముల్.
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - తినుచో తియ్యని వేపగింజ మదిలో దీపించు సద్యోగముల్.
మత్తేభము:
వినుమా చూడగ నోట బెట్టి నమలన్ వేపాకు చేదౌనుగా
తినగా మారును మారు మారు నదియే తీపెక్కు నట్లే భువిన్
మనుజుండెప్పుడు కష్టమైన పనులన్ మార్మారు చేపట్టగా
'తినుచో తియ్యని వేపగింజ' మదిలో దీపించు సద్యోగముల్.

Subscribe to:
Posts (Atom)