తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday 2 July 2013

అఱవమునందు వేమన మహాకవి భాగవతమ్ముఁ జెప్పెఁగా!

శ్శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - అఱవమునందు  వేమన మహాకవి భాగవతమ్ముఁ జెప్పెఁగా!

చంపకమాల:
అఱవక చెప్పు మెందు విన ' నప్ప ' గ  బిల్తురు తండ్రి ? నెవ్వరే  
వెఱవక మేడిపండు వలె వెల్గెడు సంఘము గుట్టు విప్పె? తా
కఱవదిదీర పోతనయె స్కంధములందున నేమి జెప్పెనో
అఱవమునందు - వేమన మహాకవి - భాగవతమ్ముఁ జెప్పెఁగా!   

No comments: