తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday, 9 July 2013

సురభికి జన్మించె ఖరము చోద్య మెటులగున్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - సురభికి జన్మించె ఖరము చోద్య మెటులగున్
సూరయ్య అను వాడు  తాను పెంచే గాడిద జంటకు సురభి, సూరి అని పేర్లు పెట్టుకున్నాడు...

కందము:
సురభీ, సూరీ  ఖరములు
సూరయ్యే పెంచినాడు చూడగ నొకటై 
మరియొక్క నాడు 'కనగా'
'సురభికి' జన్మించె ఖరము చోద్య మెటులగున్?

No comments: