తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday 11 July 2013

కారము లేకున్న కావు కార్యములెందున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - కారము లేకున్న కావు కార్యములెందున్.

కందము: 
కారము వలె కూరకు, సహ
కారము వలె దంపతులకు కాపురమున, శ్రీ
కారము వలె కావ్యమునకు
'కారము' లేకున్న కావు కార్యములెందున్.

1 comment:

Hasith Goli said...

ilaanti padhaalu vaduka bhasha lo bhagam kada neeku ! :D