తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday 18 July 2013

గడ్డము గీచుకొమ్మనుచు కాంతుడు భార్యకు జెప్పె ప్రీతితో.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - గడ్డము గీచుకొమ్మనుచు కాంతుడు భార్యకు జెప్పె ప్రీతితో.
కుటుంబ పోషణకై కుల వృత్తియగు క్షురకర్మను చేపట్టిన ఒక ' కొమ్మ ' (వనిత) గురించి టీవీలో కొంత కాలం క్రితం చూచాను.
ఉత్పలమాల:
గడ్డము సేయువారు కనగా మగవారని యెంచ బోకుమీ
గడ్డను బుట్టి బిడ్డలను గావగ జానెడు పొట్ట కోసమై
అడ్డము గాదు స్త్రీత్వమని యమ్మడు వృత్తిని బట్టె నీమెయే
గడ్డము గీచు ' కొమ్మ ' నుచు కాంతుడు భార్యకు జెప్పె ప్రీతితో.

No comments: