తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday, 20 July 2013

తమ్ము గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - తమ్ము గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు.

తేటగీతి:
బ్రహ్మ కడిగిన పాదమ్ము బలిని త్రొక్కి
యణచి వేసిన పాదమ్ము హనుమ భక్తి
పట్టి వదలని పాదమ్ము గట్టిగ సత
తమ్ము గొలిచిన యెడల స్వాంతమ్ము లలరు. 

No comments: