తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday, 28 July 2013

కల్ల లాడు వారు కవులు సుమ్ము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - కల్ల లాడు వారు కవులు సుమ్ము.
ఆటవెలది:
సరస గతుల దున్ని సాహిత్య సేద్యమ్ము
సలిపి కావ్య ఫలము సజ్జనాళి
చేతి కందజేసి జేజేలు పొందుట
కల్ల లాడు వారు కవులు సుమ్ము. 

2 comments:

Anonymous said...

చాల బాగుందండి !!

గోలి హనుమచ్చాస్త్రి said...

అజ్ఞాతగారూ ! ధన్యవాదములు.