తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
Wednesday, 28 December 2022
Friday, 23 December 2022
సినిమాకు "వంద"నం - 103
ఆ.వె:
కాంచిచూడ నటుదు కైకాల సత్యమ్ము
యస్వియారు పిదప "యస్" యతండె
నవరసమ్ములందు నటసార్వభౌముండు
వెలుగు వెలిగినాడు తెలుగు తెరను.
Sunday, 18 December 2022
"గోలీ"లు - 65
Monday, 14 November 2022
"గోలీ"లు - 64
కందము:
పాలిచ్చు తల్లి, తదుపరిపాలిచ్చెడు తండ్రి పైన పండితగురువుల్
పాలించవలయు, బాలల
పాలవ సంస్కార బలము బాగుగ గోలీ!
Wednesday, 9 November 2022
"గోలీ"లు - 63
Friday, 4 November 2022
"గోలీ"లు - 62
కందము:
"చుక్కెదురైతే" కష్టము
అక్కర పనిజేయువారి కపశకునమెలే
"చుక్కె"దురైతే యిష్టము
మక్కువగా త్రాగు వారి మదికే గోలీ!
Thursday, 3 November 2022
"గోలీ"లు - 61
కందము:
"ఇంకే"దో కలమందున
నింకకనుండిన రచనల కిది చాలదురా
ఇంకను తలలో నిండుగ
"నింకేదో" యుండవలయు నెప్పుడు గోలీ!
-
Monday, 31 October 2022
"గోలీ"లు - 60
Saturday, 15 October 2022
"గోలీ"లు - 59
Friday, 14 October 2022
"గోలీ"లు - 58
కందము:
చిరుగుల దుస్తుల తోడను
చిరులజ్జగ దిరుగుదురు కుచేలురు, కానీ
చిరు గులతో ఫ్యాషన్ గా
చిరుగులతో కొందరుంద్రు చిత్రము గోలీ!
Saturday, 8 October 2022
"అర" విందము
కందము:
"అరవింద"మంటి ముఖములు"అర" విందములాయె జూడ నందరి కిలలో
అరెరే "కోవిడ్" దెబ్బకు
అరలుచు కనిపించు "మాస్కు" లంటగ సగమే.
Thursday, 6 October 2022
"గోలీ"లు - 57
కందము:
Wednesday, 5 October 2022
అమ్మలగన్నయమ్మ
ఓం శ్రీ మాత్రే నమః
మీకు అందరకూ విజయదశమి శుభాకాంక్షలు.
ఉత్పలమాల:
అమ్మలగన్నయమ్మ! మనమందున నమ్మితి నమ్మ నమ్ముమా!
ఇమ్మిక మించు సంపదల నిమ్మిక విద్యలనెల్ల నాకె నీ
విమ్మిక కీర్తి, భోగముల నిమ్మనుచున్ మరి గోరబోను లే
ఇమ్మహి నీదయన్ విడక నిమ్ముగ నాపయి జూప చాలుగా!
Thursday, 29 September 2022
"గోలీ"లు - 56
కందము:
మర్మము జెప్పెద వినుమా!
ధర్మము న్యాయంబది విడి ధారుణి హరినే
ఓర్మిని గొల్వంగా, నీ
కర్మర! కాపాడ తాను కదలడు గోలీ!
Monday, 26 September 2022
"గోలీ"లు - 55
Tuesday, 20 September 2022
"గోలీ"లు - 54
కందము:
తలదించి చూచెదరు కర
తలముననే "సెల్లు"బట్టి ధారుణి ప్రజలే
తలదించు కొనెడు పనులను
తలపెట్టక జూచుటదియె తగుననె గోలీ!
Monday, 5 September 2022
"గోలీ"లు - 53
కందము:
గురువన బ్రహ్మయు విష్ణువు
గురువే మాహేశ్వరుండు కువలయమందున్
గురువు పరంబ్రహ్మయు సరి
గురువుకు నతులందజేయ గోరెద గోలీ!
Tuesday, 30 August 2022
"గోలీ"లు - 52
కందము:
కనదగు "సోషల్ మీడియ"
కనినంతనె వేగబడుచు "కన్ ఫర్మ"నకన్
కని "ఫేక్సు,ట్రూత్సు" తెలిసిన
మనుజుడె తెలివైనవాడు మహిలో గోలీ!
Monday, 1 August 2022
"బొట్టు" పద్యములు.
తేటగీతి:
శ్రీకరమ్మగు నుదుటన చిన్ని బొట్టు
హనుమ సిందూర మైనను , హరు విబూది,
విష్ణు కస్తూరి తిలకమ్ము వేడ్క మీరు.
అంబ కుంకుమ యతివల కంద మిచ్చు.
ఆటవెలది:
అడ్డబొట్టు జూడ నదియొక యందమ్ము
నిలువు బొట్టు గూడ కళగనుండు
చుక్క బొట్టు గనగ చక్కగ గనుపించు
మూడు గలిపి బెట్ట ముఖము నిండు.
తేటగీతి:
దివ్య కాంతియె నీచుట్టు దిరుగునట్లు
తిలక మింతెైన చక్కగా తీర్చినట్లు
బెట్టు జూపక నుదుటన బొట్టు బెట్టు
దృష్టి దోషము లన్నింటి ద్రిప్పి కొట్టు.
తేటగీత్:
నేల కందమ్ము తొలకరి నీటిబొట్టు
నింగి కందమ్ము చంద్రుని నిండు బొట్టు
ఆలి కందమ్ము మెడనుండు తాళిబొట్టు
ఉవిద కందమ్ము నుదుటన నుంచు బొట్టు
తేటగీతి:
చిన్నపిల్లలు పురుషులు స్త్రీలు గూడ
హిందువులె కాదు, ఎవరెైన బిందువంత
నుదుట దాల్చిన బొట్టును కుదురుగాను
ముఖము కనిపించు గాదె ప్రముఖము గాను.
సీసము:
విష్ణు పూజనుసల్పి వినయమ్ము తోడను
నిలువు బొట్టును బెట్టు నిష్ట తోడ
భవుని మదిని దల్చి భయముల బోద్రోల
భస్మ ధారణ సల్పు భక్తి తోడ
ఆంజనేయుని చెంత నాకుపూజను జేసి
సిందూరమును దాల్చు శ్రీకరముగ
అమ్మవారిని గొల్చి యఘములే నశియింప
కుంకుమ నేదిద్దు కోరికోరి.
ఆటవెలది:
అడ్డ నిలువు బొట్టు లదిగాదు ముఖ్యమ్ము
బొట్టునుదుటనుంట పుణ్యప్రదము
ఎరుపు తెలుగు రంగు లేవైన మనకేమి
పట్టుబట్టి పెట్టు బొట్టు నిట్టు.
తేటగీతి:
దూర ముగ సేయబోకు సిందూర బొట్టు
కుంకుమను బొట్టు బెట్టుట గ్రుంక నీకు
బూదిలోన గలుపకు వీబూది బొట్టు
మనదు సంస్కృతి నిలబెట్టు మరచి పోకు.
ఆటవెలది:
దోసగింజ బొట్టు దొడ్డగనే బెట్టు
శనగగింజ బొట్టు సరిగ బెట్టు
కాసు వంటి బొట్టు కనిపించగా బెట్టు
ముఖము తగ్గ బొట్టు సుఖము - " ఒట్టు "
Monday, 18 July 2022
"బొట్టు" కందాలు.
కందము:
శ్రీకరమగు నిది నుదుట వ
శీకరమని తలచ బోకు క్షేమంకరమౌ
'ఛీ' కరమున తుడుపకుమా
మీకరమే తిలక మిడగ మెత్తురు సురులే.
కందము:
పుట్టిన పట్టికి దిష్టియె
వట్టిగనే తగులకుండ పట్టుచు "చాదే"
పెట్టును తల్లియె నుదుటన
బొట్టిగ మన మొట్టమొదటి బొట్టది గదరా!
కందము:
ళులుళులుళాయీ యనుచును
తల ద్రిప్పెడు బిడ్డ నుదుట తంటాల్ బడుచున్
కలిపిన 'చాదును' బెట్టెడు
తెలుగింటను తల్లిని గన తీయని తలపౌ.
కందము:
ఇంటికి వచ్చిన బొట్టే
ఇంటికి రమ్మనుచు జెప్ప నింతికి బొట్టే
కంటికి "నో" యెబ్బెట్టే
వింటిరె మన సంసృతిగన వేడ్కగు నిట్టే!
కందము:
గోటికి గోరింటాకే
మేటిగ కాలికినిగజ్జె మీదట తీరౌ
కాటుక కంటికి, జడయును
బోటికియందమ్ము నుదుట బొట్టే సుదతీ!
కందము:
శోభను గూర్చునుగద నొక
యాభరణము చేరియున్ననది మగువలకే
ఆభరణమె బొట్టొక్కటి
సౌభాగ్యమె నుదుట బెట్ట చక్కటి మోమున్.
కందము:
అద్దము చేతను బట్టుచు
నొద్దికగా ముఖము గనుచు నొకచేతన్ తా
ముద్దుగ నుదుటను కుంకుమ
దిద్దెడు భంగిమ పడతికి తీరుగనుండున్.
కందము:
నీమము వీడక కొందరు
కోమలులే బొట్టు నుంత్రు క్రొత్తగ, కలిలో
లేమకు చర్మపు రంగున
నేమైనా "ఉంది" "లేద" నేటట్లుండున్.
కందము:
హిందువు నీవేయైనచొ
బిందువుగా నుదుట బొట్టు పెట్టుము చాలున్
అందునలౌకిక భావన
మందును మనమనమున కొక హాయే గలుగున్.
కందము:
తిలకము నుదుటన దిద్దుము
తిలకించుము మోము చుట్టు తేజము హెచ్చున్
పులకింతలు మది గలుగగ
తిలకమవై సాటివారి తీరును గనుమా!
Thursday, 14 July 2022
"గోలీ"లు - 51
కందము:
మానము దోచగ కావర
మై "నరులే" కొందరుంద్రు, మాయల కలిలో
"మైనరులే" కొందరటులె
హీనులుగా మారిరిగద, హేయము గోలీ!
Sunday, 10 April 2022
చింతామణి
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
Wednesday, 6 April 2022
"గోలీ"లు - 50
Saturday, 2 April 2022
"యుగాది"
Tuesday, 1 March 2022
"చింత" నీకుమా
అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
Monday, 7 February 2022
"లతాజీ" కి నివాళిగా
నిన్న మనలను వీడి పోయిన "గానకోకిల" భారతరత్న" "లతాజీ" కి నివాళిగా
Sunday, 6 February 2022
మా తరం
శ్రీ మహా సరస్వత్యై నమః
Sunday, 16 January 2022
మకర సంక్రాంతి
అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
Friday, 14 January 2022
"రేగు" ల కొరకై
మీకు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.
Saturday, 1 January 2022
ఇరవై ఇరవై రెండు
మీకు మీ కుటుంబ సభ్యులకు 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు.