అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
సీసము:
కోర్కెగాలిపటము కొండెత్తు కెగిరిన
అదుపునుంచగ దారమందవలయు
గంగిరెద్దు మనసు గతితప్ప నీయక
చెప్పినట్లు వినగ జేయవలయు
చుక్కలవలయముల్ చూడ సమస్యలౌ
చక్కగా గలుపుచు సాగవలయు
పాడిపంట ధనము ఫలముగా వచ్చిన
పరులకింతయు బంచి బ్రతుకవలయు
ఆటవెలది:
కాల చక్రగతిని గనుచుండి ధర్మపు
మార్గమందు నడచి మనగవలయు
మనిషికపుడు భావి మకరసంక్రమణపు
పండుగగును నిజము నిండుగాను.
No comments:
Post a Comment