మీకు అందరికీ "శుభకృత్" నామ వత్సర శుభాకాంక్షలు.
సీసము:
దుష్ట వైరసుపైన తోచిన కోపమ్ము
"కారమై" మనసుల కదలుచుండె
పాడు కోవిడు భువి బట్టిన పీడయై
"చేదు" జ్ఞాపకముల చీడ మిగిలె
టీకాల దయతోడ మాకేమికాదను
"తీపి" విశ్వాసమ్ము తీరు నిండె
గుమిగూడ వచ్చిక గుబులేమివలదన
"పుల్ల"దనమ్ము ప్రఫుల్లమాయె
ఆటవెలది:
"వగరు"గాను తోచె వాడరా "మాస్కన"
"ఉప్ప"దనము నిచ్చె నొక్క "శంక"
ఇన్ని గలసి యుండ నెన్నియో శుభముల
నీ"యుగాది" బంచు నిజము నిజము.
No comments:
Post a Comment