తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 7 February 2022

"లతాజీ" కి నివాళిగా

 నిన్న మనలను వీడి పోయిన "గానకోకిల" భారతరత్న" "లతాజీ" కి నివాళిగా


కందము:
స్వరములు నాట్యము జేసిన
వర రంగ స్థలము మూయ "పాపపు విధియే"
తిరుగుచు నున్నవి పాపము
"సరిగమపదని"లు జగమున జాలిగ, కనరే!


No comments: