శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 -02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.      
సమస్య : భీముడు భీష్ము జంపెనతి భీకరలీల జగమ్ము మెచ్చగన్
సమస్య : భీముడు భీష్ము జంపెనతి భీకరలీల జగమ్ము మెచ్చగన్
ఉ:రాముని శిష్యు డప్పుడు పరాక్రమమొప్పగ పోరు సల్పగా
    నేమియు పాలువోక మరి యెట్టుల జచ్చునొ తాత జెప్పగా   
    భీముని తమ్ముడర్జునుడు వ్రేల్చె  శిఖండిని ముందు నిల్పి, ఏ
    భీముడు భీష్ము జంపెనతి భీకరలీల జగమ్ము మెచ్చగన్? 
 
