తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday 22 November 2011

నవమి నాఁడు వచ్చె నాగ చవితి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 08 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                     సమస్య - నవమి నాఁడు వచ్చె  నాగ చవితి

ఆ.వె:  పుట్టినింటికి 'కళ'  పురిటికి శ్రీరామ
          నవమి నాఁడు వచ్చె,   నాగ చవితి
          దాటె,  కలిగె నొక్క తనయుడు  ముద్దార
          జూపి మురిసె  భర్త చూడ రాగ. 

2 comments:

G.P.V.Prasad said...

మీరు plus widget add చేసుకుంటే బాగుంటుంది.

మీ పూరణం బాగుంది.

గోలి హనుమచ్చాస్త్రి said...

గెల్లి ఫణీంద్ర గారూ ! స్వాగతం. మీ సూచనకు ధన్యవాదములు.