శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజకేళిలోన్.
చంపకమాల:
అతులిత శౌర్య మూర్తి మదనారికి భక్తుడు శౌరికాప్తుడౌ
స్తుతమతి సవ్యసాచి గని చూపుల ప్రేమను చూపి మెచ్చె స
మ్మతమున నాయులూచి, సఖు మానసమిట్టులె దోచి పాండురా
ట్సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజకేళిలోన్.

No comments:
Post a Comment