తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday 3 September 2012

పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్.

చంపకమాల:
పదపద వేడుకొందమిక పల్కుల రాణిని, వేడుకొన్నచో
వదనము నందు జేరు శుభ వాక్కుల వెల్గులు, పద్యమల్లుచో
వదలక వర్ణ వర్ణమున పాదము నిల్పుచు నాట్య మాడుగా
పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్.

No comments: