తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 1 September 2012

యమునకు పద్యానురక్తి హాయింగూర్చున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - యమునకు పద్యానురక్తి హాయింగూర్చున్.

కందము:
క్రమముగ మాధవ పెద్దియు
కమనీయుడు ఘంటసాల గాయక పద్యం
బమరము, వినగా మన హృద
యమునకు పద్యానురక్తి హాయింగూర్చున్.

కందము:
అమరగ పద్యమ్ముల స
క్రమముగ నాశువుగఁ జెప్పు రమ్యముగానే
ప్రమదమున చిట్టి చెల్లెలు
యమున కు, పద్యానురక్తి హాయిం గూర్చున్.

No comments: