తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday 3 May 2012

మతిలేని నరుండు మిగుల మన్నన నొందున్.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - మతిలేని నరుండు మిగుల మన్నన నొందున్.

కందము: 
గతి చెడి  యెటులో జనస
మ్మతమున తా సభ్యుడగుచు మంత్రిగ నుండన్
హత విధి ! మన చట్ట సభను
మతిలేని నరుండు  మిగుల మన్నన నొందున్.

1 comment:

Anonymous said...

భామాతాడన హతుడయ్యె గోపాలుడు
భామ కోసమై భస్మమయ్యె భస్మాసురుదు
స్వ దారాపహతులై మగలు వగచె శ్రీ
మతి లేని నరుండు మిగుల మన్న న నొందున్

(not according to grammar)