శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 01-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - రావణున కంజలించెను రామపత్ని
తేటగీతి:
చెప్పెను విభీషణుడు తాను చేతులెత్తి
రావణున కంజలించెను; "రామపత్ని
నిప్పు వంటిది కాలును నీవు గోర
నిట్లు, కోరుము కాలుని నీవు గోర".
No comments:
Post a Comment