శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20-05-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - గుఱ్ఱానికి నైదు కాళ్ళు కోడికి వలెనే
సమస్య - గుఱ్ఱానికి నైదు కాళ్ళు కోడికి వలెనే
కందము:
కుఱ్ఱాడ! తలలు శ్రీహరి
గుఱ్ఱానికి నైదు, కాళ్ళు కోడికి వలెనే
మఱ్ఱాకు పైన వేసెను
బుఱ్ఱా వారిటుల క్రొత్త బొమ్మను గనుమా.
గుఱ్ఱానికి నైదు, కాళ్ళు కోడికి వలెనే
మఱ్ఱాకు పైన వేసెను
బుఱ్ఱా వారిటుల క్రొత్త బొమ్మను గనుమా.
కందము:
జెఱ్ఱికి కాళ్ళకు చెప్పులు
గుఱ్ఱానికి నైదు కాళ్ళు, కోడికి వలెనే
గొఱ్ఱెకు బఱ్ఱెకు యీకలు
కుఱ్ఱాడట గీసి జూపె కోతికి కొమ్ముల్.
గుఱ్ఱానికి నైదు కాళ్ళు, కోడికి వలెనే
గొఱ్ఱెకు బఱ్ఱెకు యీకలు
కుఱ్ఱాడట గీసి జూపె కోతికి కొమ్ముల్.
No comments:
Post a Comment