శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-05-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - కలిమి గలిగించు కలకంఠి కంటి నీరు.
సమస్య - కలిమి గలిగించు కలకంఠి కంటి నీరు.
తేటగీతి:
భర్త 'యెమ్మెల్యె' చనిపోగ భార్య నిలచి
పోటి జేసెను ఏడ్చెను సీటు కొరకు
కరుణ జూపెను ఓటరు గాన గెలిచె
'కలిమి గలిగించు కలకంఠి కంటి నీరు.'
పోటి జేసెను ఏడ్చెను సీటు కొరకు
కరుణ జూపెను ఓటరు గాన గెలిచె
'కలిమి గలిగించు కలకంఠి కంటి నీరు.'
తేటగీతి:
బయట వ్యాపారములు జేయ బాగు గాను
కలిమి గలిగించు, కలకంఠి కంటి నీరు
యింట గార్చిన యిల్లాలి యేడ్పు వలన
కదలి పోవును చెప్పక కలుములన్ని.
కలిమి గలిగించు, కలకంఠి కంటి నీరు
యింట గార్చిన యిల్లాలి యేడ్పు వలన
కదలి పోవును చెప్పక కలుములన్ని.
No comments:
Post a Comment