కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-05-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - వంక బెట్ట దగును శంకరునకు.
ఆట వెలది:
సమస్య - వంక బెట్ట దగును శంకరునకు.
ఆట వెలది:
-
భక్తి మనసు నిండ పరమేశు దలచుచు
పద్య మొకటి చెప్పి ప్రస్తుతించ
నీమమేమి లేదు నిందాస్తుతులు జెప్పి
వంక బెట్ట దగును శంకరునకు.
-
చిట్టి పొట్టి బొమ్మ లిట్టుల సర్దుము
ముందు వైపు నిడుము స్కందు నిటుల
కరి ముఖుని కుడి మరి గిరితనయ నెడమ
వంక బెట్ట దగును శంకరునకు.
No comments:
Post a Comment