తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 19 November 2011

సంసారిగ మారి యోగి సంతసమందెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07- 08 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

         సమస్య - సంసారిగ మారి యోగి సంతసమందెన్


కం:  శాంసన్ యోగీ నక్సల్
       హంసా లక్ష్మిని వరించి యామెయె జెప్పన్
       హింసా ప్రవృత్తి
ని విడచి
       సంసారిగ మారి యోగి సంతసమందెన్. 

4 comments:

Disp Name said...

పూట పూటకు మాతాకవళం అనలేక,
ఆ మాత జగన్మాత ధ్యానించి
జ్ఞాని అయి 'కాళీ' దాసుడై,
సంసారిగ మారి యోగి సంతసమందెన్

సంపత్ కుమార్ శాస్త్రి said...

పరశురాముడు, 21 మారులు క్షత్రియ సంహారము చేసి, యుద్ధములను ఏవగించుకొనుచూ తిరిగి హంసాకృతి = పరమేశ్వరిని, ద్యానిస్తూ............ అనే అర్థములో...

హింసావిదూరుడయివి
ధ్వంసంబులనేవగించి బైరాగివలెన్,
హంసాకృతిజపముల ని
స్సంసారిగ మారి యోగి సంతసమందెన్.

సంపత్ కుమార్ శాస్త్రి said...

హనుమచ్చాస్త్రి గారూ,

మీ పద్యములో మూడవ పాదములో మూడవ గణము తప్పినదనుకొంటాను. విడచి బదులుగా విడచుచు అంటె సరిపోతుందని నా భావన.

గోలి హనుమచ్చాస్త్రి said...

జిలేబి గారూ ! చక్కని వూహ జేశారు. బాగుంది.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ ! బ్లాగునకు స్వాగతము.
నిస్సంసారిగా మార్చిన మీ పూరణ బాగుంది.
నా పూరణ లో "ప్రవృత్తి" లో మొదటి రెండక్షరములు గగ ము అవుతుందను కున్నాను. సవరణకు ధన్యవాదములు.