తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 31 October 2011

కొడుకునకున్ కూతునిచ్చె కోమలి ముదిమిన్

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 26-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

   
   సమస్య - కొడుకునకున్ కూతునిచ్చె కోమలి ముదిమిన్


కం: విడిగా సంబంధమ్ముల
       పడిపడి నే చూడలేను 'భయ్యా' యనుచున్
       ముడి పెట్టగ చినతమ్ముని
       కొడుకునకున్ కూతునిచ్చె కోమలి ముదిమిన్.

2 comments:

Kuchimanchi Nagendra said...

శాస్త్రి గారు,
మీరు ఎవరికి ఎవరినైన ఇవ్వగల సమర్దులు.
ఇలాగీ మంచి పద్యాలు రాయా లని కొరుకుంటు.
మీ నాగీంద్ర.

కమనీయం said...

కడు గొప్పది సంబంధము
నొడగూర్చు తన జతనముల నోడెను ఆపై,
కడకొక అతిసామాన్యుని
కొడుకునకున్ గూతు నిచ్చె కోమలి ముదిమిన్.