తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday 1 November 2011

మందు త్రాగి పొందె మరణ మతడు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 06 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                     సమస్య -  మందు త్రాగి పొందె మరణ మతడు.


ఆ.వె:  మందు మాను మనుచు మందుడ నీలోక
          మందు భార మనుచు మందలించ;
          మందు, విషము
లిపి మంది చూడగ గ్రామ
          మందు, త్రాగి పొందె మరణ మతడు. 

1 comment:

కమనీయం said...

సగము కొంత వైద్య శాస్త్రము నేరిచి
తనకు తానె ఔషధమ్ము కలిపి
వినక నెవరు చెప్ప వికటించు మోతాదు
మందు తాగి పొందె మరణ మతడు.