తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday 30 October 2011

దత్తపది - "కరణము - వరణము - తరణము - చరణము".

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 24-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


దత్తపది - "కరణము - వరణము - తరణము - చరణము". 
స్వేచ్ఛా ఛందము లో రాముని గుణ గణములు వర్ణన.


ఆ.వె: నరుల 'జీవరచన' నవ్య వ్యాకరణము
          ఆర్త జనుల రక్ష కావరణము
          రామచంద్ర స్వామి రమ్యమౌ చరణము
          భక్తు లెల్లరకును భవ తరణము.


 

2 comments:

కమనీయం said...

అందరూ దైవపరంగా పూరిస్తారు.నేను వేరే విధంగా==

కరమున్ గలుషితమగు పర్యా
వరణము గాచగ నవశ్య కరణము కార్యా
చరణము పెంపొందించుటె
తరణము భువి నుద్ధరింప దగు సూత్రమ్మౌ

కమనీయం said...

మీ టంట--సమస్యకు నా పూరణం

భవుని కంటి మంట భస్మమై నాడంట
తుంటరి వలరాజు తొల్లి యట్లె
మింట వెలుగు రాజు,మిసిమిని గోల్పోయె
అభవుదేవి శాపమంటగానె.