శ్రీ చింతా రామకృష్ణారావు గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 22-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
దత్త పది - "బాబూమోహన్ - బ్రహ్మానందం - కోట - ఆలీ"
విషయము:- పచ్చదనము పరిశుభ్రత.
విషయము:- పచ్చదనము పరిశుభ్రత.
ఆ.వె: తులసి కోట నింట తెలిసి పెంచగ వలె
బాబు! మోహనమ్ము పచ్చ చెట్లు
చుట్టు పట్ల పెంచ శోభనమా లీల
బ్రహ్మ నందన నుతు భార్య నిలచు.
బాబు! మోహనమ్ము పచ్చ చెట్లు
చుట్టు పట్ల పెంచ శోభనమా లీల
బ్రహ్మ నందన నుతు భార్య నిలచు.
బ్రహ్మ నందన (నారద ) నుతుని(నారాయణుని ) భార్య (లక్ష్మి) తాండవిస్తుందని నా భావం.
3 comments:
తులసికోటను దాటుచు దోగియాడు
బాబు మోహను గని తన ఆలి తోడ
మగడు పలికె బ్రహ్మానంద మాయె మనకు
ముద్దులొల్కెడి పాపని మోము చూడ.
కమనీయం గారూ! చక్కని పూరణ. అభినందనలు.రెండవ పాదంలో యతి సరిచూడాలి.
శాస్త్రి గారూ,ధన్యవాదాలు,సరిగా చూసుకోలేదు.ఈవిధంగా సవరిస్తున్నాను.
బాబు మోహను గని యాలి భర్త బిలిచి
యనెను మనకు బ్రహ్మానంద మాయెనదిగొ
Post a Comment