తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday 28 October 2011

భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషుఁ డూనె గర్భమున్.

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 21-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


              సమస్య -  భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషుఁ డూనె గర్భమున్


ఉ:  మామయు అత్తయున్ తనను మన్నన జేయుచు' చాక్లె టివ్వలే'
      దేమని కోపగించి మరి వెంటనె ' బుజ్జులు ' వారి చిత్రమే
      నామును దీసి గీసె గద నచ్చిన రీతిగ; గీసి చూడగా
     "భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషుఁ డూనె గర్భమున్" 

6 comments:

కమనీయం said...

ధీమతులైన శోధకులు దేవుని సృష్టికి మారుగా ప్రజా
క్షేమము వీడి కల్పనల చేసిరి వెర్రి ,ప్రయోగశాలలన్
ఏమి విచిత్రమో కనుడి యీ నవలోకమునందు, దానిచే
భామకు మీసముల్ మొలిచె బాపురె పూరుషుడూనె గర్భమున్ !

గోలి హనుమచ్చాస్త్రి said...

కమనీయం గారూ ! చక్కని నడకతో, ఇతివృత్తం తో సాగింది మీ వృత్తం. అభినందనలు.

Nrahamthulla said...

"రక్తమాంస పురీష మూత్రముల పాత్ర
మేలిమి పసిండి బొమ్మంచు మెరుపటంచు
అబ్జులగువారు మోహాందులగుచు తలతురు
అంతియే కాక సౌందర్యమనగ గలదే?"
ఈపద్యం చింతామణి స్టేజిడ్రామాలోది.లతాలక్ష్మి గారు అద్భుతంగా పాడారు.రచయిత ఎవరో చెప్పగలరా?

గోలి హనుమచ్చాస్త్రి said...

రహమతుల్లా గారూ ! బ్లాగునకు స్వాగతం.
తెలుగునాట ఒకప్పుడు ఉరూరా ప్రదర్శింపబడి ప్రజల నోళ్ళలో నానిన గొప్ప నాటకమయిన చింతామణి రచయిత శ్రీ కాళ్ళకూరి నారాయణ రావు గారు.

Nrahamthulla said...

ధన్యవాదాలు హనుచ్చాశాస్త్రిగారూ.

Nrahamthulla said...

గౌతమపత్నితో గలిసిన ఇంద్రాధముని పూజసేయరే పుణ్యులారా
కన్నకూతురని జంకక చెయ్యజార్చిన బ్రహ్మ దేవుడు గాడె ప్రాజ్నులారా
సప్త ఋషి సతులతో సంగమించిన మహేశ్వరుని అర్ధింపరే అనఘులారా
జార సామ్రాట్టు మురారికి గుడికట్టి భజనలు చేయ్యరే భక్తులారా

నీతియట ధర్మమట నాకు నేర్పెదరట
కాటికిన్ కాళ్ళు జాచిన ఘనుడనయ్యు
సోమరిన్ కట్టుకొని గొడ్దు పోయినాడ
తప్పునాయదిగాని తరుణిదౌనె?తప్పునాయదిగానీ ఇతరునిదౌనె?
చెప్పనేటికి పొండయా పెద్దలారా----తారాశశాంకం నాటకంలో పి.సూరిబాబు బృహస్పతి గా పాడిన పద్యమిది.రచయిత ఎవరో చెప్పగలరా?