తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday 26 April 2011

కూకూ!క్వాక్ క్వాక్! మేమే!

                                  కూకూ!క్వాక్ క్వాక్! మేమే!


ఆ.వె.   వేల జనము ముందు వేదిక పైనెక్కి
          ధ్వనుల ననుకరించు ఘనుడొకండు
          పక్షి జంతువులను పలు పలు విధముల
          అనుకరించుచు నపుడరచె నిటుల.

కం.     కూకూ!క్వాక్ క్వాక్! మేమే!
          కాకా! బుస్ బుస్సు! గాండ్రు గాండ్రూ! మ్యావ్ మ్యావ్!
          కోకొరొ కొక్కో! అంబా!
          కీ కీ! హీహిహి! బెక బెక! కిచ కిచ! భౌ భౌ!


4 comments:

కంది శంకరయ్య said...

అద్భుతంగా ఉంది మీ ధ్వన్యనుకరణ పద్యం.

గోలి హనుమచ్చాస్త్రి said...

శంకరం మాస్టరు గారూ!ధన్యవాదములు.
రాఘవ కిరణ్ గారూ! మౌనం లోనే భావాన్నందించిన మీకు ధన్యవాదములు.

Anonymous said...

డియర్ శాస్త్రి గారు.... పద్యాలు ఇలా కూడ వ్రాయవచ్చని ఇపుడే చూశాను.....మరికొన్ని వెరైటీ రచనలకొసమై ఎదురు చూస్తున్నాము....కూఊఊఊఊఊ..చుక్.... చుక్... చుక్... చుక్
భుష్.... భుష్ .....భుష్ భుష్ భుష్ భుష్
G.S.Sastry hyd

గోలి హనుమచ్చాస్త్రి said...

జీ యస్ గారూ! థాంక్.. స్.. స్...స్... స్... స్...