తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
చంపకమాల:
గురుచరణమ్ము బట్టి తన గోడును జెప్పుచు సేవజేయగా
బరువును దీర్చి నేను యను భ్రాంతిని దేహమునందు బోవగా
సరియగు బోధజేయుచును సత్కృపతోడను వెన్ను దట్టుచున్
మరిమరి జ్ఞానజ్యోతులను మానసమందున నింపు, సత్యమే.
Post a Comment
No comments:
Post a Comment