తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday, 10 November 2017

పార్థసారథి పరిమార్చె పాండవులను.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 08 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణసమస్య - పార్థసారథి పరిమార్చె పాండవులను.తే.గీ: 
నరునియరదమ్ము చక్కగా నడిపెనెవడు?
ఏమిజేసెను తా మేనమామ నపుడు?
తోడు వీడకరక్షించె వాడెవరిని? 
పార్థసారథి-పరిమార్చె- పాండవులను.

No comments: