తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday, 4 November 2017

మత్తుమందు సేవించుట మంచిదె కద.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 08 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణసమస్య - మత్తుమందు సేవించుట మంచిదె కద.తే.గీ: 
మాదకపు ద్రవ్య ములవాడు మానవుండు 
మత్తులోనుండ వలదన మాన దలచి 
తప్పు దెలిసి వైద్యుని గోరి తగను వీడ 
మత్తు, మందు సేవించుట మంచిదె కద.

No comments: