శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 05 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - సాఫ్టువేరు చిప్పు సరిదాని మెదడులో

సీసము:
ఏకులవృత్తినో చీకుచింతయులేక
దానితండ్రియె నేర్పె తాను జెపుమ
ఏయూనివర్సిటీ కీపిట్ట వెడలుచు
సాంకేతికపువిద్య జదివె జెపుమ
ఏశిక్షణాకేంద్ర మీరీతి గట్టగా
చెప్పిబంపెను బూని విప్పి చెపుమ
ఏనెట్టులోన తానెట్టులో వెదకుచు
విధము జూచె నిదియ విధిగ జెపుమ
ఆటవెలది:
ఎండ,వానబడదు 'ఏసీ' గ గదియుండు
గ్రుడ్లుపొదుగ పిట్ట గూడునిదియె
సాఫ్టువేరు చిప్పు సరిదాని మెదడులో
ప్రకృతి పెట్టె దాని ప్రతిభ గనుమ.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - సాఫ్టువేరు చిప్పు సరిదాని మెదడులో

సీసము:
ఏకులవృత్తినో చీకుచింతయులేక
దానితండ్రియె నేర్పె తాను జెపుమ
ఏయూనివర్సిటీ కీపిట్ట వెడలుచు
సాంకేతికపువిద్య జదివె జెపుమ
ఏశిక్షణాకేంద్ర మీరీతి గట్టగా
చెప్పిబంపెను బూని విప్పి చెపుమ
ఏనెట్టులోన తానెట్టులో వెదకుచు
విధము జూచె నిదియ విధిగ జెపుమ
ఆటవెలది:
ఎండ,వానబడదు 'ఏసీ' గ గదియుండు
గ్రుడ్లుపొదుగ పిట్ట గూడునిదియె
సాఫ్టువేరు చిప్పు సరిదాని మెదడులో
ప్రకృతి పెట్టె దాని ప్రతిభ గనుమ.
No comments:
Post a Comment